CM PK on OTT: ఓటీటీలోకి సీఎం పీకే.. టార్గెట్ పవన్ కల్యాణ్‌యేనా?
గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా దగ్గర ఓ రేంజ్ లో హైలైట్ అవుతున్న పలు కాంట్రవర్సియల్ ఘటనల్లో అల్లు అండ్ మెగా కాంపౌండ్ కలహాలు కూడా ఒకటి. కాగా మెగా కాంపౌండ్ నుంచి ఎప్పుడైతే అల్లు బ్రాండ్ బయటకి రావడం మొదలైందో అక్కడ నుంచే అటు అల్లు అర్జున్ అలాగే ఇంకోపక్క అల్లు అరవింద్ స్వరం కూడా మారింది అని మెగా అభిమానులు అంటున్నారు.
కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటి నుంచో చేసిన పలు కామెంట్స్ మెగా అభిమానుల్లో సీరియస్ గా మారాయి కానీ ఆ మధ్య జరిగిన ఎన్నికల ఘటన మరింత చిచ్చు పెట్టింది. కానీ తర్వాత పుష్ప 2 కి హైక్స్ ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ కళ్యాణ్ బాబాయ్ అంటూ థాంక్స్ చెప్పడం ఆ కొద్ది సమయం వరకు ఊరట ఇచ్చింది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ అల్లు అండ్ మెగా అభిమానుల వార్ నడుస్తుంది.

కాగా రీసెంట్ గానే అల్లు అరవింద్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విషయంలో చేసిన కామెంట్స్ కూడా మెగా అభిమానులని బాగా హర్ట్ చేసాయి. కాగా వీటి తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ పేరుని పరోక్షంగా వాడుకుంటూ ట్రోల్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఇపుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రి అభిమానులు అధికారులు డీసీఎం అంటూ పిలుచుకునే హోదాలో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ ని ఇంకో ఉన్నత స్థానం సీఎం పదవిలో చూడాలని అభిమానులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అల్లు కాంపౌండ్ కి చెందిన ఆహా ఓటిటి వారు "సీఎం పీకే" ఒక అనౌన్సమెంట్ అందించారు.
కాగా ఇది పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేసేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేరు అందుకే ఇలా ట్రోల్ చేస్తున్నారు అంటూ ఇంకొందరు ఆ పోస్ట్ లో కామెంట్స్ చేస్తుండగా ఇలా ట్రిగ్గర్ చేసే విధంగా టైటిల్స్ పెట్టుకోవడం అవసరమా అని ఇంకొందరు అనుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు మెగా కుటుంబంలో జరుగుతున్న వార్ కి డ్యామేజ్ కంట్రోల్ గా ఇలా కొత్త షోకి ఇలాంటి పేరు పెట్టారా అనే మరో కోణం కూడా ఉంది.
Make way for the most powerful entertainment, coming soon on Aha! #CMPKonAha pic.twitter.com/2Xnpx6gWio
— ahavideoin (@ahavideoIN) February 9, 2025
కానీ ఇది మాత్రం ఇపుడు సస్పెన్స్ ఫుల్ గా అనౌన్స్ చేసినప్పటికీ ఎక్కువ పవన్ మీద నెగిటివ్ యాంగిల్ లోనే వెళుతుంది. దీనితో అల్లు కాంపౌండ్ మళ్ళీ పవన్ ని ట్రోల్ చేసారా లేక తమ కొత్త షో కోసం ఇలాంటి ట్రిక్స్ తో రీచ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే వీరు పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఇక్కడ కూడా పవర్ అనే పదం పవన్ కి దగ్గరగానే పెట్టారు. మరి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











