OTTలోకి నెలకాకముందే ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్.. ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి కొత్త సినిమాల సందడి మొదలైంది. ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని సినిమాలు ఓటీటీల్లో చూడొచ్చు. అందుకు తగ్గట్లుగానే ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలు తీసుకువస్తుంది. ఇప్పుడు మరో కొత్త సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మంత్ ఆఫ్ మధు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కలర్స్ స్వాతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె మొదట బుల్లితెరపై సందడి చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంటర్ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ.. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ వికాస్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

ఈ విషయంపై స్వాతిని మీడియా ప్రతినిధులు అడగ్గా... నేను ఈ విషయంపై స్పందించను అని చెప్పుకువచ్చింది. దాంతో వీరి విడాకులు నిజమేనని చాలా మంది భావించారు. ఇక ఆ విషయం పక్కన పెడితే... ఇటీవల ఈ భామ హీరోయిన్ గా ఓ సినిమాలో నటించింది. అదే మంత్ ఆఫ్ మధు. ఈ సినిమా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి రాబోతోంది.

మంత్ ఆఫ్ మధు సినిమాలో హీరోగా నవీన్ చంద్ర నటించగా.. హీరోయిన్ గా కలర్స్ స్వాతి నటించింది. ఎమోషల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చిన మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ చిత్రంలో శ్రేయా నవేలి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. నెలకాకముందే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. స్త్రీ స్వేచ్ఛతో పాటు భార్యాభర్తల బంధాన్ని గురించి సందేశాత్మక కోణంలో దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగిగా, తాగుబోతుగా నవీన్ చంద్ర, కాలేజీ అమ్మాయిగా, గృహిణిగా కలర్స్ స్వాతి విభిన్న పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా డిజిటల్ హక్కులను దక్కించుకుంది.

మంత్ ఆఫ్ మధు ఓటీటీలో నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాను మీరు థియేటర్లలో మిస్ అయితే కనుక ఓటీటీలో ఇంట్లోనే కూర్చొని చూసేయండి.


Click it and Unblock the Notifications











