OTT: బలగం మూవీ ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న ఆ సంస్థ.. చిన్న సినిమాకు బెస్ట్ డీల్!
కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా బలగం. దిల్ రాజు తన కొత్త ప్రొడక్షన్ హౌస్ లో తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో భావోద్వేగాలని అద్భుతంగా ఆవిష్కరించారు అంటూ ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా థియేటర్స్ లో సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మూవీతో దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి కూడా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు సుధాకర్ రెడ్డి కూడా కీలక పాత్రలో నటించాడు.

ఇదిలా ఉంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నమైన కథాబలంతో వచ్చి సక్సెస్ అందుకున్న చిన్న సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో కమెడియన్ వేణుకి దిల్ రాజు దర్శకుడిగా మరో అవకాశం కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే బలగం సినిమా ఒటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ప్రముఖ ఒటీటీ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ బలగం డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది.
మూవీకి మంచి టాక్ రావడంతో ఫ్యాన్సీ రేటుని ఆఫర్ చేసి అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. మొదట ఆహా పోటీ పడినట్లు కూడా టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమాను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలలో ఎక్కువ ధరకి డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా బలగం నిలిచింది అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రచ్చరవి, వేణు కూడా కీలక పాత్రలలో నటించారు.


Click it and Unblock the Notifications











