Coolie OTT Release : కూలి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ? రజనీకాంత్ సినిమాకు రికార్డ్ ధర?

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కూలి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో హైప్ ను రీచ్ అయ్యేలానే ప్రేక్షకుల స్పందన వినిపిస్తోంది. ఎర్లీ టాక్ ప్రకారం సినిమాపై మోజార్టీ పాజిటివ్ గా ఉన్నారు. స్వల్పంగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందుతోంది. ఇక రజనీ యుఫోరియా కనిపిస్తోంది.

ఇక ఈ చిత్రం థియేటర్లలో లాంగ్ రన్ కొనసాగే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓటీటీ ఆడియెన్స్ ఈ చిత్రంపై ఆసక్తికరంగా ఉన్నారు. స్టార్ కాస్ట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసినా నచ్చితే ఓటీటీలో మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. ఇదే సమయంలో కూలి సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? ఎన్ని కోట్లకు అమ్ముడు పోయింది? ఏ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందనేది ఆసక్తికరంగా మారింది.

Coolie Movie OTT Release

కూలి చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.110 కోట్లు చెల్లించిందని సినీ ప్రముఖులు తెలుపుతున్నారు. కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకే ఈ స్థాయిలో ధర పలకడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు శాటి లైట్ హక్కులను ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ సన్ గ్రూప్ తమ వద్దనే ఉంచుకుంది. ఈ సినిమాను నిర్మించింది ఆ సంస్థనే కావడం విశేషం.

సాధారణంగా ఏ చిత్రమైనా థియేటర్లలో విడుదలైన 4 వారాల్లో ఓటీటీల్లోకి వస్తుంటుంది. ఇక స్టార్ హీరోల సినిమాలు 8 వారాల సమయం కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూలీ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ను బట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఏదేమైనా కూలి చిత్రానికి ఇటు థియేట్రికల్ గా, మరోవైపు డిజిటల్ పరంగా మంచి రెస్పాన్స్ దక్కడం ఖాయమని సినీ నిపుణులు తెలుపుతుండటం విశేషం. ముందుగా థియేట్రికల్ రన్ తో ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందనేది చూడాలి.

ఇక కూలి చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మాత కళానిధి మారన్ రూ.370 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్య రాజ్, సౌబిన్ షహిర్ కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం. ఇక శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పూజా హెగ్దే స్పెషల్ డ్యాన్స్ తో అలరిచింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్తా స్లోగా సాగిందని, సెకండ్ హ్యాప్ బాగుందని, ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకుంటుందని, అనిరుధ్ సంగీతం, స్టంట్స్ అదిరిపోయాయని రివ్యూలు అందుతున్నాయి.

More from Filmibeat

Read more about: coolie rajinikanth ott movies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X