పెళ్లైన వారికే శోభనానికి లైసెన్సా? పెళ్లికాని పరిస్థితి ఏమిటి? నాగార్జునకు సీపీఐ నారాయణ పంచ్
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో విషయంలో హోస్ట్ నాగార్జున అక్కినేని, సీపీఐ నేత నారాయణకు మధ్య మాటల యుద్ధం, వ్యాగ్యాస్త్రాలు కొనసాగుతున్నాయి. బిగ్‌బాస్ రియాలిటీ షోపై విరుచుకుపడుతున్న నారాయణపై టీజ్ చేస్తూ ఇటీవల నాగార్జున వీకెండ్ షోలో సెటైర్ వేశారు. అయితే తనను కించపరుస్తూ నాగార్జున చేసిన వ్యాఖ్యలపై నారాయణ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఇంతకు నారాయణ, నాగార్జున మధ్య వివాదం ఏమిటంటే..

నాగార్జునపై నాకు కోపం లేదు కానీ..
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ప్రారంభమైన ప్రతీసారి సీపీఐ నేత నారాయణ తీవ్రంగా స్పందిస్తుంటారు. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 6 ఆరంభమైన వెంటనే మీడియాలో స్పందిస్తూ.. నాగార్జునపై నాకు కోపం లేదు. ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున తీసుకొన్న బాధ్యతపై నాకు అభ్యంతరం ఉంది అని నారాయణ క్లారిటీ ఇచ్చారు.

బ్రోతల్ హౌస్‌కు ఎలా పంపిస్తారు?
అయితే మీడియాతో బిగ్‌బాస్ షో నిర్వాహకులపై, నాగార్జునపై ఘాటుగా నారాయణ స్పందిస్తున్నారు. బిగ్‌బాస్ షో ఓ బ్రోతల్ హౌస్. మీ పిల్లల్ని ఎలా అలాంటి ఇంటిలోకి పంపిస్తారు అంటూ తల్లిదండ్రులను నారాయణ ప్రశ్నించారు. అయితే కొన్ని నెలలపాటు ఒక ఇంటిలో మహిళలను, పురుషులను బంధించడం సంప్రదాయాలకు విరుద్ధం అంటూ నారాయణ ప్రశ్నించారు.

బిగ్‌బాస్ షోను నిషేధించాలి
బిగ్‌బాస్ తెలుగు 6 ప్రసారం చేయడం వల్ల సమాజానికి కీడు జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలను అనుమతించకూడదు. వాటిని నిషేధించాలి. వాటి వల్ల యువతపై దుష్ప్రభావం ఏర్పడుతుంది. తాను బిగ్‌బాస్ కార్యక్రమాన్ని చూడను. గత లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండటంతో చూశాను. ప్రస్తుతం నా కార్యక్రమాలతో నేను బిజీగా ఉన్నాను అంటూ ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

నారాయణ..నారాయణ అంటూ నాగ్ కామెంట్
అయితే బిగ్‌బాస్ తొలివారాంతం షోలో నారాయణ నారాయణ అంటూ నాగార్జున ఘాటుగా స్పందించారు. ఇంటిలో జంటగా వచ్చిన రోహిత్, మెరీనాను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఇద్దరు భార్యభర్తలు. మెరీనాను నువ్వు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నది. కాబట్టి.. మీరిద్దరు గట్టిగా కౌగిలించుకోమని చెప్పాడు. దాంతో రోహిత్, మెరీనా టైట్ హగ్ ఇచ్చుకొన్నారు. అయితే ఆ సమయంలో మీరిద్దరు పెళ్లైన వారు. మీకు లైసెన్స్ ఉంది.. నారాయణ.. నారాయణ.. వాళ్లిద్దరూ పెళ్లైన వారు అంటూ నాగార్జున కామెంట్ చేశాడు.
పెళ్లైన వారికే శోభనం గదినా?
నాగార్జున చేసిన కామెంట్‌పై సీపీఐ నారాయణ స్పందిస్తూ.. నాగన్న.. నాగన్న.. మీ బిగ్‌బాస్ షోలో పెళ్లైన వారికే లైసెన్స్ ఇచ్చారు. వారికి శోభనం గది ఏర్పాటు చేశారు. మిగితా వారి సంగతి ఏంటి? వారికి పెళ్లిళ్లు కాలేదు కదా.. వాళ్లు బంధువులు కాదు కదా.. మరి వాళ్లేమయ్యారు. 100 రోజులపాటు వాళ్లేమి చేస్తారో చెప్పనా అని నారాయణ ప్రశ్నించాడు. అయితే నారాయణ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











