సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన రియల్ థ్రిల్లింగ్ డాక్యుమెంటరీ.. ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి రియల్ స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. బయోపిక్ లతో పాటు నిజజీవిత కథల ఆధారంగా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. అలాగే డాక్యుమెంటరీలను కూడా తీసుకు వస్తూ.. సినీ ప్రియులను తెగ అలరిస్తున్నారు. ఇప్పటికీ ఓటీటీలో అనేక రియల్ లైఫ్ స్టోరీలు ఉండగా.. తాజాగా మరో క్రేజీ డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా వచ్చేసిన ఈ సూపర్ థ్రిల్లింగ్ డాక్యుమెంటరీ ఏంటి, దీన్ని ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పించేందుకు సృష్టి బక్షి అనే ఓ అమ్మాయి కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు పాదయాత్ర చేసింది. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ చేరుకోవడానికి ఈమెకు మొత్తం 230 రోజులు పట్టింది. అలాగే 3,800 కిలో మీటర్ల పాటు నడక ప్రయాణాన్ని సాగించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే రియల్ లైఫ్ స్టోరీనే డాక్యుమెంటరీగా తీసుకు వచ్చారు.

Crazy Documentary WOMB Women of My Billion Streaming Details Here

ఉమెన్ ఆఫ్ మై బిలియన్ అనే డాక్యుమెంటరీకి అజితేష్ శర్మ దర్శకత్వం వహించారు. సృష్టి బక్షి ఈ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రలో కనిపించగా.. నేహా రాయ్, ప్రగ్యా ప్రసూన్ సింగ్, సంగీత తివారీలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కర్ష్ జవేరి ఈ డాక్యుమెంటరీకి ఎడిటర్ గా పని చేయగా... అపూర్వ బక్షి ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. అయితే ఈ డాక్యుమెంటరీ 2021లో కెనడాలో విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ డాక్యుమెంటరీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ క్రేజీ డాక్యుమెంటరీ రాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ఈ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీని చూడాలని తెలిపింది."3,800 కి.మీ., లెక్కలేనన్ని గొంతుకలు, ఒకే ఒక సెంటిమెంట్... మహిళలపై హింస సాంస్కృతికం కాదు, ఇది నేరం, ఇదెప్పటికీ ఆమోద యోగ్యం కాదంటూ" చెప్పిన ఓ అమ్మాయి కథే ఈ డాక్యుమెంటరీ. నిజజీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీని మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X