OTTలో అదరగొడుతున్న క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్... చూడాలంటే డేర్ ఉండాల్సిందే!
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ అదరగొడుతుంది. మామూలుగా ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్, హారర్ మూవీస్ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం భక్షక్. ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించింది. భక్షక్ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా... ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి.. ఎలా ఉందో వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన చిత్రమే భక్షక్. పులకిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది. భక్షక్ మూవీలో సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్ కీలక పాత్రల్లో నటించారు. షారుక్ ఖాన్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై భక్షక్ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ సంయుక్తంగా నిర్మించారు.

షారుక్ ఖాన్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో... హిందీ చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాదు... భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించడం కూడా ఆసక్తి కలిగించింది. ఆదిత్య శ్రీవాస్తవ కూడా కీలక పాత్రలో నటించగా.. ఆయన గురించి తెలుగు వారికి కూడా పరిచయమే. ప్రముఖ హిందీ టీవీ షో సీఐడీలో కీలక పాత్ర పోషించారు. సీఐడీ సీరియల్ లో అభిజీత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.
టీజర్స్, ట్రైలర్లతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయింది. శుక్రవారం (ఫిబ్రవరి 09) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో భక్షక్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలాయళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ విషయాన్ని నిర్మాత షారుక్ ఖాన్ స్వయంగా వెల్లడించారు.

భక్షక్ సినిమా కథ విషయానికి వస్తే.. వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు అంతా అత్యాచారానికి గురవుతుంటారు. ఒక లోకల్ రౌడీ (ఆదిత్య శ్రీ వాస్తవ) ఈ మాఫియాను రన్ చేస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్తు వైశాలి (భూమి పడ్నేకర్) ఈ బాగోతాన్ని బయటపెట్టేందుకు నడుంబిగిస్తుంది. మరి బాలికలు, మహిళలలపై జరుగుతున్న నేరాలను వైశాలి ఎలా గుర్తించిందనే కథంశమే ఈ భక్షక్.
వైశాలి ఆధారాలతో సహా వాటిని వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో వైశాలి ఎలాంటి సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంది అనేవి తెలుసుకోవాలంటే భక్షక్ సినిమాను చూాడాలి. ఇక ఈ సినిమాను చూడాలంటే కాస్త డేర్ ఉండాల్సిందే. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాత్యాయిలను చూసేందుకు చాలా మంది ఇష్టపడరు. కాకపోతే.. ఇలాంటివి మన చుట్టు జరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.


Click it and Unblock the Notifications











