OTTలోకి వచ్చేసిన మరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్.. ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
భాషతో సంబంధం లేకుండా చాలా మంది అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తుంటారు. బాగుంటుందని తెలిసినా.. లేకపోతే ఏ భాషలో ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగుంటాయో తెలుసుకునీ మరీ చూస్తుంటారు. ముఖ్యంగా కొరియన్ వెబ్ సిరీస్ లు చూసే వాళ్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. భాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ వీటిని చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
ప్రేమ, రొమాన్స్, క్రైమ్, హార్రర్, థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లను అంతా ఎక్కువగా చూస్తుండగా.. ఆ విషయం అర్థం చేసుకున్న పలు ఓటీటీ సంస్థలు.. కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే కొరియన్ భాషలో తెరకెక్కించిన ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొరియన్ భాషలో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ యే "చీఫ్ డిటెక్టివ్ 1958" వెబ్ సిరీస్. కిమ్ యంగ్-షిన్ రచించగా.. కిమ్ సియోంగ్-హూన్ దర్శకత్వం వహించారు. అలాగే లీ జె-హూన్, లీ డాంగ్-హ్వి, చోయ్ వూ-సంగ్, యూన్ హ్యూన్-సూ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో.. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, రొమాన్స్ కూడా ఎక్కువగా ఉంటబోతున్నట్లు తెలుస్తోంది.
1950వ సంవత్సరం నుంచి 1960 సంవత్సరాల మధ్య ఈ కథ సాగుతున్నట్లు చూపిస్తారు. ముఖ్యంగా యంగ్-హాన్ ఈ వెబ్ సిరీస్ లో డిటెక్టివ్ గా కనిపిస్తుండగా.. ముందు నుంచి దొంగలను పట్టుకుంటూ ఉంటాడు. అయితే అతడి వద్ద మొత్తం ముగ్గురు పని చేస్తుండగా.. వీరంతా కలిసి అనేక కేసులను సాల్వ్ చేస్తుంటారు. ఇలా దేశం కోసం పని చేసే వీళ్లు ఓ కేసును ఎలా చేదించారో చక్కగా చూపిస్తారు. అయితే ఈ సూపర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతా తెగ ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్, క్రైమ్, రొమాంటిక్.. ఇలా ఎలాంటి జోనర్ ను ఇష్టపడే వాళ్లు అయినా సరే ఈ వెబ్ సిరీస్ ను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అస్సలే మిస్ అవకండి.


Click it and Unblock the Notifications