OTTలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్... ఒక్కో సీన్​ గూస్​ బంప్సే!

ఎండలు మండిపోతున్నాయి.. బయటకు వెళ్లాలంటే భానుడు తన మంటతో భయపెడుతున్నాడు. ఇలాంటి సమయంలో సినీ లవర్స్ కు ఓటీటీయే బెస్ట్ అప్షన్. ఇక వారు ఇంట్లోనే కూర్చొని మంచి సినిమాలు చూసేందుకు ప్రతి వారం ఓటీటీ సంస్థలు కూడా మంచి సినిమాలను తీసుకువస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ గూస్ బంప్సే అని చెప్పువచ్చు. అసలు ఆ సినిమా ఏంటి..? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో
మండే ఎండకాలంలో ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసేందుకు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను తీసుకువస్తుంది. సినిమా లవర్స్ కోసం.. క్రైమ్ హారర్, రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది. ఆ సినిమా మరేంటో కాదు.. ఆస్కార్ విన్నింగ్ మూవీ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

Crime Thriller Anatomy Of A Fall Movie Telugu Version Streaming Now on Amazon Prime Video OTT Full Details Here

ఆస్కార్ విన్నింగ్ చిత్రం...
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. ఈ సినిమాలోని ప్రతి సీన్ గూస్ బంప్స్. చూస్తుంటే కచ్చితంగా ఎంగ్జైట్ ఫీల్ అవుతాం. ఇక ఈ మూవీ కేవలం ఇంగ్లీషు భాషలోనే కాదు... ఫ్రెంచ్ తోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండటంతో మనవాళ్లు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.

వందకు పైగా అవార్డ్స్...
ఇటీవలే అనాటమీ ఆఫ్ ఫాల్ సినిమా 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో పురస్కారం గెలుచుకుంది. ఈ ఏడాది ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో మొత్తం 5 విభాగాల్లో (బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్) విభాగాల్లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ నామినేట్ అయింది. అయితే ఇందులో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ లభించింది.

Crime Thriller Anatomy Of A Fall Movie Telugu Version Streaming Now on Amazon Prime Video OTT Full Details Here

35 మిలియన్లకు పైగా కలెక్షన్స్
మరోవైపు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ సినిమాగా నిలువగా... బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్, సిడన్నీ ఫిల్మ్ ఫెస్టివల్, యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ లతో పాటు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ మొత్తం వందకు పైగా గెలుచుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు మూవీ లవర్స్ మక్కువ చూపిస్తున్నారు. మరోవైపు పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండే సరికి అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. ఇక ప్రతి సీన్ గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 35 మిలియన్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

అనాటమి ఆఫ్ ఏ ఫాల్ సినిమా స్టోరీ విషయానికి వస్తే...
సాండ్ర వోయిటర్ తన కుటుంబంతో కలిసి మంచు కొండల్లో ఒంటరిగా నివసిస్తుంటారు. ఒకరోజు సాండ్ర భర్త అనుమానస్పదంగా చనిపోతాడు. అక్కడ కేవలం సాండ్ర ఫ్యామిలీ మాత్రమే ఉండడంతో భర్తను తనే హత్య చేసిందని పోలీసులు అనుకుని ఆమెను అరెస్టు చే్స్తారు. అసలు ఆ హత్య చేసిందెవరు... సాండ్ర ఎలా బయటపడిందనేది కథ. ఈ సినిమా చూస్తున్నంతసేపు మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఆకట్టుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X