OTTలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
కరోనా తర్వాత ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో ప్రతివారం సినిమాలు, వెబ్ సీరిసులు చూసేస్తున్నారు. ఇక వారం వారం అలరించేందుకు ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త సినిమాలు తీసుకువస్తున్నాయి. ఇక ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది. డిఫరెంట్ జోనర్ కోరుకునే వారికోసమే ఈ సీరిసును తెరకెక్కించారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే...
థియేటర్లో చూసే ఓపిక లేని మూవీ లవర్స్ కోసం.. ఓటీటీ కంటెంట్ ను తీసుకువచ్చారు మూవీ మేకర్స్. ఇక ఈ వారం కూడా ఓటీటీలోకి ఎన్నో కోత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే భోళా శంకర్ సినిమా కూడా ఓటీటీ వేదికగా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమాకు థియేటర్లో మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకోగా.. మరి ఓటీటీలో జనాలు ఆదరిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరోవైపు ఇటీవల ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లకు బాగా క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. నాటి మీర్జాపూర్ నుండి నేటి గన్స్ అండ్ గులాబ్స్ వరకు అన్ని క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు సూపర్ హిట్లుగా నిలిచాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందుకే స్టార్ హీరోలు వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటే... పేరున్న దర్శకులు సైతం వీటిని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా వీటిపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ రాబోతుంది. ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు సబంధించిన కంటెంట్ ను ఇష్టపడుతుంటారు. అందుకే మేకర్స్ కూడా ఈ తరహా సినిమాలు, సిరీస్ లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని చెప్పవచ్చు. అలా రూపొందిన వెబ్ సిరీసే 'బంబై మేరీ జాన్'. ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటోంది.

1960లో ముంబై పోలీసులకు, గ్యాంగ్ స్టర్స్ కు మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సిరీస్ నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. షుజాత్ సౌదాగర్ డైరెక్ట్ చేసిన బంబై మేరీ జాన్ సిరీస్ లో కేకే మీనన్, అవినాశ్ తివారి మెయిన్ రోల్స్ పోషించారు. నివేదిత భట్టా చార్య, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు వెబ్ సీరిస్ మేకర్స్. ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన బంబై మేరీజాన్ సిరీస్ ప్రస్తుతానికి హిందీలో మాత్రమే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. విడుదల అయ్యే వరకు ఈ విషయంపై క్లారిటీ లేదు. ఇక క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారు ఈ సీరిసీ చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











