OTTలోకి మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరెన్. ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక తెలుగులోనూ గత నెలలో విడుదల అయింది. ఇక్కడ సైతం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అసలు ఈ సినిమా కథేంటి.. ఎందులో చూడాలి అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

జయం రీమేక్ తో....:కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో నితిన్, సదా నటించిన జయం సినిమాను తమిళంలో రీమేక్ చేసి.. హిట్ కొట్టాడు. అలా జయం రవిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. జయం రవి అన్న సైతం ఇండస్ట్రీకి తెలిసిన వ్యక్తే. ఆయన ఎవరో కాదు.. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ మోహన్ రాజా. అన్న డైరెక్టర్ గా సినిమాలు చేస్తే.. తమ్ముడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

Crime Thriller Siren Movie Streaming on Disney Plus Hotstar OTT From April 11th Starrer Anupama Jayam Ravi Keerthy Suresh Full Details Here

స్టార్ హీరో హీరోయిన్లు...:ఇక జయం రవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల జయం రవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సైరెన్. ఇక ఈ చిత్రంలో జయం రవితో పాటు.. అందాల భామ, మహానటి కీర్తి సురేష్ సైతం నటించింది. వీరితో పాటు.. మలయాళి బ్యూటీ, టిల్లు స్క్వేర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. వీరు ముగ్గురు కలిసి ఈ చిత్రంలో నటించారు. తమిళంలో మొదటి రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది.

మంచి వసూళ్లు రాబట్టిన...:ఇక తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తెలుగులో ఫిబ్రవరి 16న థియేటర్లలోకి వచ్చింది. ఇక తెలుగులోనూ ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో సముద్ర ఖని, యోగి బాబు, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి జీవి ప్రకాష్ సంగీతం అందించాడు.

Crime Thriller Siren Movie Streaming on Disney Plus Hotstar OTT From April 11th Starrer Anupama Jayam Ravi Keerthy Suresh Full Details Here

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి...:నూతన దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలు వహించగా.. హోం మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయ్ కుమార్ నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి సందడి చేయడానికి రెడీ అయింది. సైరెన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.

పండుగ సందర్భంగా... :రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సైరన్ మూవీ ఏప్రిల్ 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సైరెన్ మూవీ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. కాగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా.. ఈ సినిమా ఓటీటీ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. :భార్య జెన్నీఫర్ (అనుపమ పరమేశ్వరన్)ను మర్డర్ చేసిన కేసులో తిలగన్‌కు (జయం రవి)కి శిక్ష పడుతుంది. ఇతనికి ఓ కూతురు కూడా ఉంటుంది. అయితే పెరోల్ పై జైలు నుండి బయటకు వచ్చిన హీరోను తల్లిని చంపినందుకు తండ్రిని అసహ్యించుకుంటుంది కూతురు. కూతురు బంధువుల ఇంటికి వెళ్లిపోగా.. తిలగన్ వరుసగా హత్యలు చేసుకుంటూ పోతాడు. తిలగన్ కేసును కీర్తి సురేష్ ఇన్విస్టిగేషన్ చేపట్టగా...తిలగన్‌ను ఎలా పట్టుకుంటుంది.. అసలు భార్యను తిలగన్ ఎందుకు చంపాడన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా కథ కొత్తగా ఉండటం, ట్విస్టులతో సాగడంతో ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X