నేరుగా OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మిస్టరీ.. క్షణ క్షణం ఉత్కంఠ రేపే దీన్ని ఎలా చూడాలంటే?
రోజురోజుకూ ఓటీటీల హవా మరీ ఎక్కువ అవుతోంది. ఎవరు చేసిన ఓటీటీలో సినిమాలు, చిత్రాలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ కొత్త సినిమా, వెబ్ సిరీస్ వచ్చినా అస్సలే మిస్ అవకుండా చూసేస్తున్నారు. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు వస్తే అస్సలే మిస్ కావట్లేదు. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతల అదిరిపోయే క్రైమ్, థ్రిల్లర్, హార్రర్, మిస్టరీ సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసుకువస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో అనేక క్రేజీ చిత్రాలు ఉండగా.. తాజాగా మరో మంచి సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అరవింద్ కృష్మ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మర్డరీ మిస్టరీ మూవీయే ఎస్ఐటి. ఈ సూపర్ మూవీకి విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించగా ఎస్ఎన్ఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ క్రేజీ మూవీలో అరవింద్ కృష్ణ, రజత్ రాఘవలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే నటాషా దోషి, అనిల్ రాథోడ్, కౌశిక్ మేకల ఈ వెబ్ సిరీస్ లో కనిపించారు.

ముఖ్యంగా అరవింద్ కృష్ణ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అలాగే నటాషా దోషి హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. జీ5 సంస్థ ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించగా.. అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ముఖ్యంగా మే 10వ తేదీ నుంచి అంటే ఈరోజు నుంచే ఈ క్రేజీ మూవీ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ హార్రర్ మిస్టరీ చిత్రాన్ని కచ్చితంగా చూడండి. ముఖ్యంగా హార్రర్, క్రైమ్ చిత్రాలను ఇష్టపడేవాళ్లు మాత్రం ఈ మూవీని అస్సలే మిక్ కాకుండి.


Click it and Unblock the Notifications











