OTTలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. క్షణ క్షణం వెన్నులో వణుకుపుట్టించే దీన్ని ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అందరూ సరికొత్త కథలను చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరహా స్టోరీలు ఏ భాషలో వచ్చినా సరే వెంటనే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు అలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లనే తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. వాటిని చూస్తూ సినీ ప్రియులు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రీసెంట్ వెబ్ సిరీస్ యే ఉండెకి. ఇప్పటికీ దీని నుంచి రెండు సీజన్లు రాగా ఇప్పుడు రాబోయేది మూడో సీజన్. గతంలో వచ్చి రెండు పార్టులు కూడా సూపర్ సక్సెస్ కాగా.. తాజాగా మూడో సీజన్ రాబోతుంది. తొలి సీజన్ 2020 జూలై 10న మొదటి పార్ట్ సోనీ లివ్ లో విడుదల కాగా... 2022 మార్చి 4వ తేదీన రెండో సీజన్ రిలీజ్ అయింది. ఇప్పుడు మూడో సీజన్ రాగా.. విడుదల తేదీని ప్రకటించారు.

ఆశిష్ ఆర్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో.. దివ్యేందు భట్టాచార్య, సూర్య శర్మ, అంచల్ సింగ్, హర్ష ఛాయా, అంకుర్ రాతీ, అభిషేక్ చౌహాన్, అయన్ జోయా, అపేక్ష పోర్వాల్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే అనుజ్ దానైత్, శివమ్ సేన్‌గుప్తాలు ఈ వెబ్ సిరీస్ కు సంగీతం అందించారు. సమీర్ నాయర్, సిద్ధార్థ్ సేన్‌గుప్తా, జ్యోతి సాగర్, దీపక్ సెగల్ లు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఇలా అదిరిపోయే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయబోతున్నారు.
గత సీజన్ లు వచ్చిన సోనీ లివ్ వేదికగానే ఉండెఖి సీజన్ 3 కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. మే 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలాగే గత సీజన్ల కంటే కూడా ఈ సీజన్ మరింత బాగుండబోతున్నట్లు చెప్పారు. థ్రిల్లర్, క్రైమ్ స్టోరీలను ఇష్టపడేవాళ్లు కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. అదిరిపోయే ఫీలింగ్ కల్గించే ఈ వెబ్ సిరీస్ ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లోనే కూర్చుని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











