Criminal Justice Season 4 Episode 5: హాట్‌స్టార్ సర్‌ప్రైజ్.. షెడ్యూల్‌కి ముందే స్ట్రీమింగ్‌లోకి ఆ ఎపిసోడ్?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్, బోల్డ్ కంటెంట్‌ ఉన్న సినిమాలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగింది. ఓటీటీల రాకతో ఇది పతాక స్థాయికి చేరుకుంది. ప్రతి ఓటీటీ సంస్థ ఖచ్చితంగా ఈ తరహా జోనర్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. రిపీట్ ఆడియన్స్, భారీ వ్యూయర్‌షిప్‌తో ఇవి కుమ్మేస్తున్నాయి. ఓటీటీలు ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మీర్జాపూర్ మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్, బూతు పురాణంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌పై సాంప్రదాయవాదులు విమర్శలు గుప్పించినా ప్రేక్షకులు మాత్రం ఇరగబడి చూశారు. ఈ సిరీస్‌లో నటించిన పంకజ్ త్రిపాఠి దేశ ప్రజలకు సుపరిచితుడు అయ్యాడు. ఓటీటీలలో ఈయన సూపర్‌స్టార్‌గా అవతరించాడు.

మే 29 నుంచి సీజన్ 4
పంకజ్ త్రిపాఠి నటించిన మరో వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ .. 2019లో తొలి సీజన్ ప్రారంభం కాగా.. 2020లో సెకండ్ సీజన్.. 2022లో మూడో సీజన్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. వీటన్నింటికీ మంచి స్సందన వచ్చింది. ప్రతి సీజన్ కూడా దేనికదే ప్రత్యేకం అన్నట్లుగా వ్యూయర్‌షిప్ సాధించింది. దీంతో నాలుగో సీజన్‌ని మొదలుపెట్టిన మేకర్స్ ఈ ఏడాది స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. క్రిమినల్ జస్టిస్ : ఏ ఫ్యామిలీ మేటర్ పేరుతో నాలుగో సీజన్‌ని సిద్ధం చేసి మే 29 నుంచి జియ్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వదిలారు.

Criminal Justice Season 4 Here s When Episode 5 Of Pankaj s Series Will Be Out

వైవాహిక బంధాలపై ఫోకస్
పంకజ్ త్రిపాఠి, మొహమ్మద్ జీషాన్ అయూబ్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగీ, శ్వేత బసు ప్రసాద్, రాజేష్ ఖేరా తదితరులు కీలకపాత్రలు పోషించారు. రోహాన్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌‌ను అప్‌లౌజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియా బ్యానర్‌పై సమీర్ నాయర్, దీపక్ సెహగల్, సమీర్ గోగటేలు నిర్మించారు. జియ్ హాట్‌స్టార్‌ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో క్రిమినల్ జస్టిస్ 4 అందుబాటులో ఉంది. వైవాహిక సంబంధాలు, కుటుంబాల ఇబ్బందులు, మానసిక ఆరోగ్యం వంటి వాటిని తాజా సిరీస్‌లో ప్రస్తావించారు.

ఎపిసోడ్ 5పై ఉత్కంఠ
మే 29 నుంచి జూలై 3 వరకు 8 ఎపిసోడ్ల కింద ప్రతి గురువారం ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించడానికి, బజ్‌ను కొనసాగించడానికి గాను ఎపిసోడ్ల విధానానికి దర్శకుడు రోహన్ సిప్పీ మొగ్గు చూపడంపై విమర్శలు వస్తున్నాయి. ఎపిసోడ్ల విధానం కాకుండా ఒకే ఫార్ములాతో ఉంటే బాగుండేదని కొందరు పెదవి విరిచారు. అయినప్పటకీ ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన నాలుగు ఎపిసోడ్స్‌కి మంచి రేటింగే వచ్చింది. జూన్ 5న విడుదలైన ఎపిసోడ్ 4కి మంచి ఆదరణ దక్కగా.. జూన్ 12న ఎపిసోడ్ 5 విడుదల కానుంది.

షెడ్యూల్‌కి ముందే ఎపిసోడ్ 5?
ఎపిసోడ్ 4ను సస్పెన్స్‌లో పెట్టడంతో ఎపిసోడ్ 5పై ఉత్కంఠ నెలకొంది. దీంతో సోషల్ మీడియాలో ఎపిసోడ్ 5 షెడ్యూల్ కంటే ముందుగానే స్ట్రీమింగ్‌‌కి అందుబాటులోకి వస్తుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వికీపడియా పేజీలో ఎన్‌క్యాప్సులేషన్ అనే ఎపిసోడ్ సోమవారం విడుదల కానుందని ఉండటం ఈ పుకార్లకు బలం చేకూర్చుతోంది. అయితే దీని గురించి కొన్ని మీడియా సంస్థలు ఆరా తీయగా.. సీజన్ 4ని ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే స్ట్రీమింగ్ చేస్తామని హాట్ స్టార్ వర్గాలు స్ఫస్టం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 షెడ్యూల్ ప్రకారం వస్తుందా? లేక ముందే స్ట్రీమింగ్ అవుతుందా అన్న ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే

More from Filmibeat

Read more about: pankaj tripathi surveen chawla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X