OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రియల్ స్టోరీ.. 2 వారాలుగా 30 దేశాల్లో ట్రెండింగ్‌లో..!

ఓటీటీలోకి ఎన్నో సినిమాలు, సిరీసులు వస్తుంటాయి. అయితే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ రియల్ క్రైం స్టోరీని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ డాక్యూమెంటరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కర్రీ అండ్ సైనేడ్ అనే పేరుతో డ్యాక్యూమెంటరీ సీరిస్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకువచ్చింది. యదార్థ ఘటనతో ఈ సిరీస్ ను తెరకెక్కించగా.. ఇది రెండు వారాలుగా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంతలా ఈ సిరీసులో ఏముందో స్టోరీలో తెలుసుకుందాం.

ప్రేక్షకుల టేస్టుకు అనుగుణంగా కొత్త కొత్త సినిమాలు, సిరీసులు తీసుకువస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఓ రియల్ స్టోరీ డ్యాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఈ మధ్య కాలంలో రియల్ స్టోరీలను బేస్ చేసుకుని సినిమాలు, సిరీసులు, డాక్యూమెంటరీలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ కోవలోనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యూమెంటరీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Curry&Cyanide The Jolly Joseph Case Documentary Series Trending in Netflix Ott Top 10 Over 30 Countries Globally Full Details Here

కర్రీ అండ్ సైనేడ్ డాక్యుమెంటరీ 2023, డిసెంబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఓ నిజ జీవిత కథ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని క్రిస్టో టామీ.. ఆధ్యంతం ఆసక్తి కలిగించేలా రూపొందించాడు. ఈ రియల్ ఇన్సిడెంట్.. మీడియాలో వార్తలను ఫాలో అయ్యే వారికి సుపరిచితమే. కేరళలో జరిగిన ఓ యాదార్థ ఘటన అధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇక ఈ జాలీ జోసఫ్ కేసు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

'కర్రీ & సైనేడ్' కథేంటంటే... 2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జాలీ జోసఫ్‌ అనే మహిళ ఏకంగా 6 హత్యలు చేసి.. సంచలనం సృష్టించింది. 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఆమె ఈ హత్యలకు పాల్పడింది. ఆమె తన కుటుంబ సభ్యులను చంపేందుకు తినే ఆహారంలో సైనేడ్‌ కలుపుతూ హత్యలను చేసింది. ఇక ఈ స్టోరీని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ డాక్యూమెంటరీ రూపంలో తీసుకువచ్చింది.

కేరళలోని కూడతైకి చెందిన జాలీ జోసఫ్.. రాయ్ థామస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడుతుంది. ఇక తన జీవితానికి అడ్డు వచ్చిన అత్తను, మామను తినే ఫుడ్ లో సైనేడ్ కలిపి చంపుతుంది. ఆ తర్వాత అత్త సోదరుడిని, తన రెండో భర్త భార్యను, కూతురుని ఇలాగే చంపుతుంది. మొత్తం మీద ఈమె క్రూరంగా 6 హత్యలు చేస్తుంది. అయితే ఇన్ని హత్యలు చేస్తున్నా... ఇంట్లో వాళ్లకు ఎందుకు డౌట్ రాలేదు... చివరకు ఎలా బయటపడిందనే విషయాలు తెలుసుకోవాలంటే డాక్యూమెంటరీని చూడాల్సిందే.

Curry&Cyanide The Jolly Joseph Case Documentary Series Trending in Netflix Ott Top 10 Over 30 Countries Globally Full Details Here

ఇక ఈ థ్రిల్లింగ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండింగ్ కొనసాగుతుంది. డిసెంబర్ 22న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా.. విడుదల అయిన దగ్గర్నుంచి దాదాపు రెండు వారాలుగా 30 దేశాల్లో టాప్ 10 లో ఉంది. జనాలు విపరీతంగా ఈ సిరీస్ ని వీక్షిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా నెట్‌ ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇక ఈ 'కర్రీ & సైనేడ్' సిరీస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. మరి మీరు కూడా ఈ థ్రిల్లింగ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఇంట్లోనే కూర్చొని చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X