Cuttputlli review మెప్పించని సీరియల్ క్లిల్లింగ్ డ్రామా.. అక్షయ్ కుమార్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating: 2/5

నటీనటులు: అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, చంద్రచూడ్ సింగ్, సర్గమ్ మెహతా, సుజిత్ శంకర్, జాషువా లీక్లైయిర్ తదితరులు
దర్శకత్వం: రంజిత్ తివారీ
నిర్మాతలు: జాకీ భగ్నానీ, వశు భగ్నానీ
మ్యూజిక్: జూలియస్ పాకియం (బీజీఎం), తనీష్ బాగ్చీ, ఆదిత్య దేవ్
సినిమాటోగ్రఫి: రాజీవ్ రవి
ఎడిటింగ్: చందన్ అరోరా
స్టంట్స్: పర్వేజ్ షేక్
బ్యానర్: పూజా ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్: 2022-09-02

అర్జన్ సేథి (అక్షయ్ కుమార్) క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలకు దర్శకత్వం వహించాలని కలలు కంటాడు. సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలను క్రమం తప్పకుండా అనుసరించడమే కాకుండా పరిశోధనలు కూడా చేస్తుంటాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా రంగాన్ని వదిలేసి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా చేరి విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీలో బాలిక కిడ్నాప్, హత్యా సంఘటనలు సంచలనం రేపుతాయి. స్కూల్ విద్యార్థినుల హత్యలకు కారణాలను అర్జన్ సేథి విశ్లేషిస్తే.. సీనియర్లు అతడి వాదనను కించపరుస్తాడు. ఈ క్రమంలో తాను ఇష్టపడే దివ్య (రకుల్ ప్రీత్ సింగ్) కోడలు కిడ్నాప్‌కు గురవుతుంది.

సినిమా రంగాన్ని వదిలి అర్జన్ సేథి ఎందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు? సబ్ ఇన్స్‌పెక్టర్‌గా సీనియర్ల నుంచి ఎలాంటి అవమానాలను అర్జన్ ఎదుర్కొన్నాడు? దివ్య కోడలు కిడ్నాప్‌కు గురైతే అర్జన్ ఎలా కేసును దర్యాప్తు చేశాడు? బాలికల వరుస హత్యలు, కిడ్నాప్‌లకు కారణం ఎవరు? సీరియల్ కిల్లర్‌గా క్రిస్టఫర్ (జాషువా లీక్లైయిర్) ఎందుకు మారాడు? స్కూల్‌లో దుష్ట టీచర్ పురుషోత్తం తోమార్ (సుజిత్ శంకర్)కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కట్‌పుత్లీ సినిమా కథ.

Cuttputlli movie review and rating: Akshay Kumar unable to impress the serial killing drama

కట్‌పుత్లీ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న రాట్సాసన్, తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమాకు రిమేక్. తమిళ, తెలుగులో వచ్చిన ఈ సీరియల్ కిల్లింగ్ డ్రామా ఆసక్తికరంగా ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. ఇక కట్ పుత్లి విషయానికి వస్తే.. ఆ రేంజ్ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ ప్రేక్షకుడికి కనిపించవు. రొటీన్ క్రైమ్ డ్రామాగా సాగుతుంది. తమిళ, తెలుగు సినిమాలు చూడని వారికి కొంత ఆసక్తికరంగా ఈ సినిమా ఓ రకమైన అనుభూతిని అందించే అవకాశం ఉంది.

అర్జన్ సేథిగా అక్షయ్ కుమార్ ఆకట్టుకొలేకపోయాడు. వయసు పైపడటంతో యువ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో మెప్పించలేకపోయాడు. తమిళ, తెలుగు రీమేక్‌లో విష్ణు విశాల్, బెల్లంకొండ శ్రీను తమ పాత్రలో ఒదిగిపోవడంతోపాటు పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. కానీ అక్షయ్ కుమార్ ఏ మాత్రం తనదైన శైలిలో ఫెర్ఫార్మెన్స్‌ను చూపించలేకపోయాడనే చెప్పవచ్చు. ఇక దివ్యగా రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర గెస్ట్‌గానే కనిపిస్తుంది. దాంతో ఆమె నటించడానికి, గ్లామర్ పండించడానికి స్కోప్ లేకపోయింది. అక్షయ్, రకుల్ మధ్య కెమిస్ట్రీ పండలేదు.

మిగితా పాత్రల విషయానికి వస్తే.. నరేందర్ సింగ్ పాత్రలో చంద్రచూడ్ సింగ్ ఆకట్టుకొన్నాడు. చిన్న పాత్రైనా ఫీల్‌గుడ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. పోలీస్ ఆఫీసర్‌గా సర్గన్ మెహతా ఫర్వాలేదనిపించారు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి బాగుంది. హిమాచల్ ప్రదేశ్ అందాలను చక్కగా కెమెరాలో బంధించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ బాగుంది. మిగితా విభాగాల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి.

భావోద్వేగాలు ఏ మాత్రం పండని సీరియల్ కిల్లింగ్ డ్రామా కట్‌పుత్లీ. ఎమోషన్స్, ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే అంశాలు ఉన్నప్పటికీ.. తెర మీద సాదాసీదాగనే కనిపిస్తాయి. అక్షయ్ కుమార్ కాకుండా యంగ్ హీరో ఎవరైనా చేసి ఉంటే.. తెర మీద, కమర్షియల్‌గా ఫలితం మరోలా ఉండేదనిపిస్తుంది. తెలుగు, తమిళ వెర్షన్లలో సినిమా చూసిన వారికి కట్‌పుత్లీ నిరాశను కలిగిస్తుంది. ఓటీటీ ద్వారా రిలీజైన కట్ పుత్లీ చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. భారీ అంచనాలు పెట్టుకోకుండా వీలైనంత ఖాళీ సమయం ఉంటే.. ఓసారి చూడండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X