daaku maharaaj OTT : ఓటీటీలోకి డాకు మహారాజ్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

నందమూరి బాలకృష్ణ - బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్‌లతో ఇప్పటికే అంచనాలు పెంచేసిన ఈ సినిమా బాలయ్యకు బాగా అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్‌లో రావడంతో సినిమా ఎలా ఉండబోతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్న బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్‌పై భారీ అంచనాలున్నాయి. ఇక వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్‌కు మంచి హిట్ అందించిన కేఎస్ రవీంద్ర (బాబీ) టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడం మరో ప్రత్యేకత.

daaku maharaaj ott release when to expect Nandamuri Balakrishna s Movie to stream online

సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందు‌లో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌లు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇక ఈ సినిమాపై భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్.

అలాగే ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీని ప్రకారం డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది.

జనవరి 10న రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ థియేటర్‌లో రిలీజ్ అవ్వగా.. ఈ సినిమా నుంచి డాకు మహారాజ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2లో 20 నిమిషాల మేర అదనపు సన్నివేశాలను జోడించిన నేపథ్యంలో ఇది కూడా బాలయ్య సినిమాపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా .. సినిమా రిలీజ్ అయి గంటలు గడవక ముందే డాకు మహారాజ్‌ను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇకపోతే .. డాకు మహారాజ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే డీల్ ఎంత మొత్తానికి కుదిరిందన్న సంగతి మాత్రం తెలియరాలేదు. త్వరలోనే ఈ వివరాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి సినిమా స్ట్రీమింగ్ కావాలి. దీనిని బట్టి డాకు మహారాజ్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X