Dacoit OTT Release: ఓటీటీలోకి అడివి శేష్ 'డెకాయిట్'.. యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dacoit OTT Release: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన 'డెకాయిట్' సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ వేదికపై మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యాక్షన్, లవ్, రివెంజ్ కాంబోగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు షానియల్ డియో అద్భుతమైన ట్రీట్‌మెంట్ ఇవ్వగా, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ఫ్లస్ పాయింట్ గా మారాయి. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో డెకాయిట్ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు? అడివి శేష్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంది? స్ట్రీమింగ్ ఎప్పుడు? అనేది పరిశీలిస్తే..
'డెకాయిట్' కథ విషయానికి వస్తే.. అనాథ అయిన హరి (అడివి శేష్) ధనిక కుటుంబానికి చెందిన సరస్వతిని ప్రేమిస్తాడు. కానీ అనుకోని సంఘటనలతో అతను అత్యాచారం, హత్య కేసులో జైలుకెళ్తాడు. మరోవైపు సరస్వతి తన గతాన్ని మరిచి కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. జైలు నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన హరి, తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ సమయంలో సరస్వతి కూడా తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రేమ, ప్రతీకారం మధ్య జరిగే సంఘర్షణ కథను మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.

సాంకేతికంగా కూడా ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ కాగా, ముఖ్యంగా 'చిచ్చు బుడ్డి' పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డెప్ట్ అన్నీ కలిపి ఈ కాంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా మార్చేశాయి. ఇక బడ్జెట్ పరంగా చూస్తే.. ఈ సినిమా సుమారు రూ.70 కోట్ల వ్యయంతో రూపకల్పన చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.20 కోట్ల థియేకల్ బిజినెస్ జరగగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ కోసం సుమారు రూ.65 కోట్ల గ్రాస్ అవసరమని అంచనా వేయగా, కేవలం మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు తెచ్చిపెట్టింది.
డెకాయిట్ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించి, శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ స్టార్ట్‌గా నిలిచింది. పాజిటివ్ టాక్‌తో పాటు స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో మూడు వారాల తర్వాత కూడా వీకెండ్స్‌లో మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.35 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా మంచి రన్ సాధించింది. సుమారు రూ.13 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటి, నిర్మాతలకు భారీగానే లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక బ్లాక్‌బస్టర్ మూవీ నిలిచిన డెకాయిట్ మూవీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ( Netflix)ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. తాజా అప్‌డేట్స్ ప్రకారం.. ఈ సినిమా మే 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియా భాషల్లో ఒకేసారి విడుదల స్ట్రీమింగ్ కానున్నది.


Click it and Unblock the Notifications