Dacoit OTT: డెకాయిట్ ఓటీటీ స్ట్రీమింగ్ డిటెయిల్స్.. అడివి శేష్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డెకాయిట్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో డెకాయిట్ ఓటీటీ పార్ట్‌నర్ గురించి ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అడివి శేష్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంది? స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు? అనేది పరిశీలిస్తే..

డెకాయిట్ తారాగణం
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా డెకాయిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్, షానియల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Dacoit OTT Release When And Where To Watch Adivi Sesh s Movie Online After Theatrical Run

డెకాయిట్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి డెకాయిట్ మూవీకి 70 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ విలువలు, ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ప్రమోషనల్ కార్యక్రమాలు, ఈవెంట్ల కోసం భారీగా ఖర్చు చేసి సినిమాపై హైప్ తగ్గకుండా చూసుకుంటూ వచ్చారు.

డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్ ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున ఆంధ్రా- నైజాంలలో డెకాయిట్‌కు 20 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 3.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6.5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా డెకాయిట్ మూవీకి 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో అడివి శేష్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల రూపాయల షేర్.. 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్ టార్గెట్ నిర్దేశించారు.

డెకాయిట్ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరు?
డెకాయిట్ మూవీకి థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు డిజిటల్, ఆడియో, శాటిలైట్ రైట్స్‌కు మంచి ధర పలికినట్లుగా వార్తలు వస్తున్నాయి. డెకాయిట్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. థియేటర్‌లో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం డెకాయిట్ మూవీ మే చివరి వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి డెకాయిట్ స్ట్రీమింగ్ ఆలస్యం కావొచ్చు.. లేదంటే ముందుగానే రావొచ్చు. దీనిపై అమెజాన్ ప్రైమ్ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Read more about: dacoit adivi sesh mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X