చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన గుండెల్ని పిండేసే ప్రేమకథా చిత్రం.. ఎందులో చూడాలంటే?

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు విడుదల అయిన కొంత కాలానికే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయినా సరే ఎవరూ ఊహించని విధంగా నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలు అయితేనే 45 రోజుల తర్వాత డిజిటల్ లోకి స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తున్నాయి. లేదంటే 20 రోజుల వ్యవధిలో కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం చాలా రోజుల క్రితం థియేటర్లలో విడుదల కాగా ఇప్పటికి ఓటీటీలోకి వచ్చింది. ఆ సినిమా ఏంటి, ఎందుకు ఆలస్యంగా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, దగ్గుబాటి రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఈ ఏడాది ఓ సినిమా చేశారు. అదే అహింస. ఈ సినిమాలో దగ్గుబాటి అభిరామ్ సరసన గీతికా హీరోయిన్ గా నటించింది. అయితే అద్భుతమైన పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కిన అహింసా సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ. కిర‌ణ్ నిర్మించారు. అలాగే సూపర్ టాలెంటెడ్ గ్రేట్ డైరెక్టర్ తేజ దీనికి దర్శకత్వం వహించారు.

Daggubati Abhiram Ahimsa Movie Now Streaming on Amazon Prime Check Details Here

ఈ సినిమాలో దగ్గుబాటి అభిరామ్, గీతికతో పాటు.. సదా, సముద్రఖని, రజత్‌ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, నమోజ్ టైగర్, కల్పలత, దేవీ ప్రసాద్.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 5న విడుదల చేశారు. అలాగే ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయగా.. ఆశించిన స్థాయిలో హిట్టు కాలేకపోయింది. అంతేకాదు థియేటర్లలోకి వచ్చినట్లు కానీ, పోయినట్లు కానీ ఎవరికీ తెలియదు. అయితే ఇంత కాలం తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

చడీచప్పుడు లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఓటీటీలోకి రావడంతో ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేదు. అమెజాన్ ప్రైమ్ వేదికగా డిసెంబర్ 6వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఆ అద్భుతమైన విలేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీని ఓసారి చూసి ఆనందించేయండి. కేవలం ప్రేమ కథే కాకుండా న్యాయ పోరాటం గురించి కూడా ఈ సినిమాలో ఉంటుంది. హీరో, హీరోయిన్లు ఈ సినిమాలో బావా మరదళ్లు. మొదటి నుంచే వీరిద్దరూ ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు.

Daggubati Abhiram Ahimsa Movie Now Streaming on Amazon Prime Check Details Here

అయితే ఓ మంచి రోజు చూసుకుని ఇరు కుటుంబాల పెద్దలు.. వీరిద్దరికీ నిశ్చితార్థం చేస్తారు. అయితే అదే రోజు హీరోయిన్ ను ఎవరో అత్యాచారం చేస్తారు. అయితే ఆ విషయాన్ని దాచకుండా హీరో నిందితులకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తారు. అయితే ఆయన న్యాయ పోరాటంలో గెలిచారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఆ అద్భుతమైన సినిమాను ఓటీటీ వేధికగా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X