Sir Movie OTT: ధనుష్ సార్ మూవీ ఓటీటీలో వచ్చేది ఎప్పుడు.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
తమిళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడుగా గుర్తింపును అందుకున్న ధనుష్ ఈ మధ్యకాలంలోనే తెలుగులో కూడా తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఇక మొత్తానికి అతను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన సార్ సినిమా శుక్రవారం రోజు భారీ స్థాయిలో విడుదలైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ ప్రొడక్షన్లో ట్తెరపైకి వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.
ఇక మొత్తానికి సార్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. తమిళంలో ఈ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు అయితే అందుతున్నాయి. నేటి తరం విద్య వ్యవస్థలకు సంబంధించిన అక్రమ వ్యాపారాల గురించి దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది అని చాలామంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

అయితే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులకు సంబంధించిన విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక సార్ సినిమా తెలుగు తమిళ్ హక్కులను మొదట హాట్ స్టార్ కొనుగోలు చేసుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ నేడు సినిమా విడుదల కావడంతో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ మరోసారి ధనుష్ సార్ సినిమాను భారీ దొరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఓటీటీ లో 50 రోజుల తరువాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని సొంతం చేసుకుంది. గతంలో కంటే ఎక్కువ స్థాయిలోనే సార్ సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. దాదాపు నిర్మాతలు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే మంచి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్ అయితే అందుకుంటుంది. ఇక రెండవ రోజు నుంచి సినిమాకు కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.
పోటీగా పెద్ద సినిమాలు కూడా లేవు కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ కు ఇదే మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో అతను తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా మొత్తం గా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా మరో ద్విభాషా చిత్రం చేయబోతున్న విషయం తెలిసింది.


Click it and Unblock the Notifications











