Kaatera OTT: సలార్‌కు పోటీగా వచ్చి సూపర్ హిట్ అయిన కాటేరా ఓటీటీలోకి.. ఎప్పటి నుంచంటే?

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ నటించిన తాజా చిత్రం కాటేరా గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకు పోటీగా వచ్చి బరిలో నిలిచిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. డిసెంబర్ 29వ తేదీన కన్నడలో విడుదల అయిన ఈ సినిమా విపరీతమైన క్రేజ్ వచ్చింది. రైతుల సమస్యలను అందరికీ అర్థం అయ్యేలా చూపించిన ఈ సినిమా.. దర్శన్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. థియేటర్ల వద్ద బాక్సాఫీసును బద్ధలు చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ఆ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దర్శన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆరాధన రామ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే తెలుగు సినియన్ హీరో జగపతి బాబు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. అలాగే కుమార్ గోవింద్, వైజనాథ్ బిరాదార్, మాస్టర్ రోహిత్, ప్రియదర్శిని, వినోద్ కుమార్ అల్వా, శృతి, శ్రీనివాస మూర్తి.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ నిర్మించారు.

Darshan Kaatera Movie OTT Streaming From February 9th Check Details

45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 104. 58 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో టాక్ కూడా పాజిటివ్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. ఇలా ఎవరూ ఊహంచని స్థాయిలో హిట్టు కొట్టిన ఈ సినిమాను చూడాలాని చాలా మంది ఇతర భాషల సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసమే అన్నట్లుగా ఈ చిత్రబృందం.. కాటేరాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 వేధికగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16వ తేదీన హీరో దర్శన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న తేదీ కంటే కూడా ఓ వారం రోజులు ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఎక్స్ వేధికగా ప్రకటించింది. అయితే కేవలం కన్నడ భాషలో మాత్రమే ఈ సినిమా 9వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది.

Recommended Video

Kaatera OTT..Challenging Star Darshan తెలుగు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ | Filmibeat Telugu

Darshan Kaatera Movie OTT Streaming From February 9th Check Details

తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రావడానికి కాస్త సమయం పడుతుందని సమాచారం. ముఖ్యంగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాను చూడని వారు ఓటీటీలోకి వచ్చిన వెంటనే చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. కచ్చితంగా తెలుగులోనే కావాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X