OTTలోకి డైరెక్టుగా ప్రభాస్, షారుక్‌ను భయపెట్టిన చిత్రం.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ లను భయపెట్టిన ఓ చిత్రం రాబోతుంది. ప్రభాస్, షారుక్ లను భయపెట్టిన చిత్రం ఏంటా అని ఆలోచిస్తున్నారా... ప్రభాస్ నటించిన సలార్, షారుక్ ఖాన్ నటించిన డంకీ చిత్రాలకు పోటీగా కన్నడంలో కాటేరా అనే చిత్రం రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కన్నడంలో రిలీజ్ అయినప్పటికీ... 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ రెండు చిత్రాలు సలార్, డంకీలకు గట్టి పోటీనిచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అసలు ఈ సినిమాలో ఏం ఉంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కన్నడంలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోల్లో దర్శన్ ఒకరు. ఆయనను అభిమాను డీ బాస్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ హీరో తాజాగా నటించిన చిత్రం కాటేరా. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాకపోయినా.. ఆ మేర కలెక్షన్లు రాబట్టాయి. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

 Darshan Kaatera Movie Telugu Version Going To Streaming on Zee5 OTT From Feb 9th Full Details Here

రైతుల సమస్యను కథగా తీసుకుని.. ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా మొదటి నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో.. హీరో దర్శన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు కీలక పాత్రలో నటించాడు. కాటేరా మూవీని 50 కోట్ల రూపాయలతో నిర్మించగా.. బాక్సాఫిస్ వద్ద 200 కోట్ల మేర వసూళ్లు రాబ్టటింది.

కాటేరా చిత్రం బాక్సాఫీస్ వద్దకు వచ్చినప్పుడు ప్రభాస్ చిత్రం సలార్ తో పాటు.. షారుఖ్ చిత్రం డంకీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను కాటేరా చిత్రం భయపెట్టింది. కలెక్షన్ల పరంగా కాటేరాకు ఎక్కువగా ప్రేక్షకులు మొగ్గు చూపాయి. అసలు కన్నడంలోనే రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ రెండు పాన్ ఇండియా చిత్రాలను వణికించింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్ ఓటీటీలోకి డైరెక్టుగా రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని అన్ని భాషల ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. ఫిబ్రవరి 9వ తేదీనుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కాటేర చిత్రం స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఇది అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Darshan Kaatera Movie Telugu Version Going To Streaming on Zee5 OTT From Feb 9th Full Details Here

ఇక ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తారు అనే వార్తలు రాగా... ఇప్పుడు డైరెక్టుగా ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. సలార్, డంకీ చిత్రాలను భయపెట్టిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఇక ఈ చిత్రం కోసం తెలుగులో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయితే వారికి పండగే అని చెప్పవచ్చు. ఇంకేందుకు ఆలస్యం.. ఓటీటీలో రిలీజ్ అయ్యాక మీరు ఇంట్లోనే ఈ 200 కోట్ల సూపర్ హిట్ సినిమాను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X