Das Ka Dhamki: అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి.. ఎప్పుడంటే?

విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా మార్చు 19వ తేదీన గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తనే హీరోగా నటించడమే కాకుండా విశ్వక్ సొంతంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రసన్న కుమార్ కథను అందించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదట ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకుంది. ముఖ్యంగా హీరో విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా దమ్కీ సరికొత్త రికార్డును అందుకుంది.

ఈ సినిమాలో విశ్వక్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి అని విశ్వక్ చేసిన ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అయ్యాయి. అయితే కమర్షియల్ గా ఈ సినిమా ఓవర్గం వారిని బాగానే ఆకట్టుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం అన్ని వర్గాల వారిని థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక ఆదివారం వరకు కోటికి పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా సోమవారం మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయాయి.

Das ka dhamki movie new ott release date streaming details

ఒక విధంగా ధమ్కీ సినిమా కంటే 25 రోజుల క్రితం వచ్చిన బలగం సినిమాకు ఏపీ నైజాంలో ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ సినిమా అనుకున్న డేట్ కంటే ఓటీటీ లోకి ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ధమ్కీ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

అయితే ఒప్పందం ప్రకారం ధమ్కీ సినిమాను థియేట్రికల్ గా విడుదలైన 5 వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందే ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ రెండవ వారం లేదా మూడో వారంలో ధమ్కీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X