విష్ణుప్రియను పెట్టుకున్నది అందు కోసమే.. ఏం చేసినా ఎంజాయ్ చేస్తాను.. జేడి చక్రవర్తి కామెంట్స్
టాలీవుడ్ యాంకర్ లలో గ్లామర్ బ్యూటి విష్ణుప్రియ ఒకరు. పోరా పోవే షోతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది విష్ణుప్రియ భీమనేని. అలా ఆమె గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
టీవీ షోలు కాకుండా చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తోన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు ఇటీవల తెగ హైలెట్ అయ్యాయి. నటుడు జేడీ చక్రవర్తి అంటే తనకు చాలా ఇష్టమని, పెళ్లి కూడా చేసుకోవాలని ఉందని విష్ణుప్రియ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విష్ణుప్రియపై జేడీ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

దయా నటీనటులు: నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ప్రధాన పాత్రలో తాజాగా నటించిన వెబ్ సిరీస్ దయా (Dayaa Web Series). దయాలో జేడీతోపాటు ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్, కమల్ కామరాజు, విష్ణుప్రియ (Vishnupriya Bhimeneni), జోష్ రవి, బబ్లూ పృథ్వీరాజ్, మయాంక్ పరాఖ్, కల్పికా గణేష్, గాయత్రి గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మంచి రెస్పాన్స్: దయా వెబ్ సిరీస్ ను సేనాపతి, సావిత్రి, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాను డైరెక్ట్ చేసిన పవన్ సాదినేని (Pavan Sadineni) దర్శకత్వం వహించాడు. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలి, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న దయా వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే దయా ప్రమోషన్స్ లో విష్ణుప్రియ స్పీచ్ తర్వాత పవన్, జేడి చక్రవర్తి ఆమె గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అతనితో జాగ్రత్త: దయా సిరీసులో జర్నలిస్ట్ షబానాగా నటించిన యాంకర్ విష్ణుప్రియ "నేను దయా వెబ్ సిరీసులో చేస్తున్నానంటే డైరెక్టర్ పవన్ సాదినేనితో తలనొప్పి, కాస్తా జాగ్రత్త అని మా మేనేజర్స్ చెప్పారు. కానీ దేవుడి దయ వల్ల తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు లక్కీగా మంచి టీమ్ తో పని చేసే అవకాశం వచ్చింది. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. ఐయామ్ సో లక్కీ" అని చెప్పుకొచ్చింది.

యాక్టింగ్ రాకున్నా: విష్ణుప్రియ స్పీచ్ తర్వాత డైరెక్టర్ పవన్ సాదినేని మాట్లాడారు. "బేసిక్ గా నేను ఆ క్యారెక్టర్ కి యాక్టింగ్ రాకపోయినా పర్లేదు. ఫిజిక్ ఉంటే చాలు అని ఫీల్ అయ్యాను" అని విష్ణుప్రియకు స్ట్రాంగ్ పంచ్ వేశాడు డైరెక్టర్ పవన్ సాదినేని. అంటే విష్ణుప్రియకు యాక్టింగ్ రాదనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెబుతూ కేవలం ఫిజిక్ కోసమే పెట్టుకున్నట్లుగా తెలిపాడు.
నాకేం ఇబ్బంది లేదు: అనంతరం జేడి చక్రవర్తి స్పీచ్ ఇచ్చాడు. విష్ణుప్రియది చైల్డ్ మెంటాలిటీ. "విష్ణుప్రియకు మంచి హృదయం ఉంది. నైస్ సోల్. ఆమెది చిన్నపిల్లల మనస్తత్వం. ఆమె ఏం చేసినా కూడా నాకు ఇబ్బంది ఉండదు. ఎంజాయ్ చేస్తాను" అని విష్ణుప్రియ గురించి జేడి చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇలా డైరెక్టర్ పవన్ సాదినేని, జేడీ చక్రవర్తి వ్యాఖ్యలతో యాంకర్ విష్ణుప్రియ మరోసారి హైలెట్ అయింది.


Click it and Unblock the Notifications











