ఓటీటీలోకి అర్జున్ రెడ్డి రేంజ్ మూవీ.. మొత్తం అలాంటి సీన్లే.. ఇంతకీ ఎందులో చూడాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ మధ్య కాలంలో బోల్డ్ కంటెంట్ ఉన్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి చిత్రాలకు యంగ్ ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా వీటి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇలా ఇటీవలే ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసిన క్రేజీ రొమాంటిక్ మూవీనే 'సిద్దార్థ్ రాయ్'.
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా.. వీ యశస్వీ తెరకెక్కించిన సినిమానే 'సిద్దార్థ్ రాయ్'. లవ్ స్టోరీకి రొమాన్స్, ఎమోషన్స్ జోడించి రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే భారీ అంచనాలను ఏర్పరచుకుని ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా మాత్రం మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే.

దీపక్ సరోజ్ - యశస్వీ కలయికలో తెరకెక్కిన 'సిద్దార్థ్ రాయ్' చిత్రానికి టాక్‌కు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి తక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ మూవీ ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను పెద్దగా వసూలు చేయలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతో దాదాపుగా రన్‌ను ముగించింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై టాక్ నడుస్తూనే ఉంది.
క్రేజీ స్టోరీతో రూపొందిన 'సిద్దార్థ్ రాయ్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ మంచి రేటునే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ చిత్రం హిట్ కాకున్నా స్ట్రీమింగ్ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

దీపక్ సరోజ్ హీరోగా నటించిన 'సిద్దార్థ్ రాయ్' సినిమాను మే 3వ తేదీన అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆహా సంస్థ తాజాగా అనౌన్స్ చేసింది. అంటే రాబోయే అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందుకోసం ఆహా సంస్థ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఇక, ఈ బోల్డు మూవీ కోసం ఓటీటీ ప్రియులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. దీపక్ సరోజ్ హీరోగా నటించిన 'సిద్దార్థ్ రాయ్' మూవీని శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. తన్వి నేగి, నందిని, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాధాన్ మ్యూజిక్‌ను ఇచ్చారు.


Click it and Unblock the Notifications











