For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Degala Babji reveiw: మెప్పించిన బండ్ల గణేష్.. కానీ సినిమాకు అవే మైనస్!

  |

  Rating: 2.25/5

  కమెడియన్‌గా, నిర్మాతగా బండ్ల గణేష్ తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితులు. నిర్మాతగా బిజీగా మారిన తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.అయితే తాజాగా తమిళంలో పార్తీబన్ నటించిన ఉత్త సిరప్పు సైజు 7 చిత్ర రీమేక్‌తో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో సోలోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేట్రికల్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం చివరకు ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది? పార్దీబన్‌కు జాతీయ అవార్డు తెచ్చిన పెట్టిన చిత్రానికి బండ్ల గణేష్ న్యాయం చేశాడా? అనే విషయంలోకి వెళితే..

  ఓ హత్య కేసులో డేగల బాబ్జీ (బండ్ల గణేష్)ని పోలీసులు అరెస్ట్ చేసి ఇంటారాగేషన్ ప్రారంభిస్తాడు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో తనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ విచారణ కొనసాగించకుండా మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ వేస్తాడు. డేగల బాబ్జీతోపాటు కుమారుడు పవన్‌ను కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకు వస్తారు.

  Degala Babji movie reveiw and rating: Bandla Ganesh impresses but not upto the mark

  విచారణలో డేగల బాబ్లీ తన నేరాలను ఒప్పుకొన్నాడా? కేసు విచారణలో పోలీసులకు ఎలాంటి సవాళ్లు విసిరాడు? ఈ హత్య కేసు విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటపెట్టాడు? భార్యతోపాటు మరి కొందరిని ఎందుకు బాబ్లీ చంపాల్సి వచ్చింది? నిజంగా బాబ్జీ హత్యలు చేశారా? ఈ హత్యల వెనుక రాజకీయ నేతలు, ఇతర వ్యక్తులకు హస్తం ఉందా అనే ప్రశ్నలకు సమాధానమే డేగల బాబ్లీ సినిమా కథ.

  డేగల బాబ్లీ సినిమా పక్కా ప్రయోగాత్మక చిత్రం. స్క్రీన్ పై ఒకే ఒక క్యారెక్టర్ అంటే.. బండ్ల గణేష్ తప్ప మరో వ్యక్తి కనిపించారు. దాదాపు గంటన్నరపైగా సాగే ఈ సినిమాలో బండ్ల గణేష్ మాత్రమే సోలో ఫెర్ఫార్మెన్స్‌తో కనిపిస్తాడు. మిగితా క్యారెక్టర్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంటుంది. బండ్ల గణేష్ సోలోగా పలు సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు. నవరసాలను పండించి ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. కామెడీ, ఎమోషన్స్, రౌద్రం, ఇలా రకరకాల అంశాలతో బండ్ల గణేష్ కనిపిస్తాడు. తన వరకు నటనతో మెప్పించాడు కానీ పార్తీబన్ పోల్చుకొంటే కష్టమే.

  తెలుగు నేటివిటీకి అనుగుణం స్వల్ప మార్పులతో దర్శకుడు వెంకట్ చంద్ర డేగల బాబ్లీని రూపొందించారు. బండ్ల గణేష్ అభిరుచికి తగినట్టుగా ఈశ్వరా పరమేశ్వరా.. అనే డైలాగ్స్‌తో అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఇక బాబ్జీ కుమారుడికి పవన్ పేరు పెట్టి అభిమానాన్ని చాటుకొనే ప్రయత్నం చేశారు. లైనస్ మాదిరి మ్యూజిక్ సన్నివేశాల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమాటోగ్రాఫర్‌కు పెద్దగా పని ఉండదు. ఒకే రూమ్‌లో ఒకే ఫ్రేమ్‌లో నటుడి హావభావాలు బాగా రాబట్టే ప్రయత్నం చేశారు.

  ఫైనల్‌గా.. బండ్ల గణేష్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కొడుకును ప్రాణాంతకవ్యాధి వెంటాడటం ఎమోషనల్‌‌గా కనిపిస్తుంది. భార్యతో అనుబంధం, ప్రేమ అంశాలు ఆకట్టుకొనే అంశాలుగా కనిపిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా సమయం ఉన్నప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసి బండ్ల గణేష్ ఫెర్ఫార్మెన్స్‌ను ఆస్వాదించవచ్చు. ఇది ప్రయోగాత్మక చిత్రం కాబట్టి పెద్దగా ఆశించడం కూడా తప్పు అవుతుంది. ఎమోషన్స్ పండలేకపోవడం, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్.

  నటుడు: బండ్ల గణేష్
  సమర్ఫణ: రిషి ఆగస్త్య
  దర్శకత్వం: వెంకట్ చంద్ర
  నిర్మాత: స్వాతి చంద్ర
  బ్యానర్: యష్‌రిషి ఫిల్మ్స్
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: లినస్ మాదిరి
  ఎడిటింగ్: ఉద్దవ్
  డీవోప: అరుణ్ ప్రసాద్ డీ
  ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికార్
  డైలాగ్స్: మరుదూరి రాజా, వైదేహీ
  ఓటీటీ రిలీజ్: AHA
  ఓటీటీ రిలీజ్ డేట్: 2022-09-02

  English summary
  Bandla Ganesh's latest movie is Degala Babji. Its streaming on AHA OTT. Here is the Telugu filmibeat exclusive reveiw.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X