Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ తొలగింపు.. కోర్టు తీర్పుతో వాళ్లకు షాక్.. రికార్డులపై తీవ్ర ప్రభావం

సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తూ.. ఇప్పుడు 'Unstoppable with NBK' షోతో సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసే ఈ టాక్ షో రికార్డుల దుమ్ముదులిపేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫలితంగా మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు రెండో దాన్ని నడుపుకుంటోంది. ఇక, ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తాజాగా బాలయ్యతో కలిసి తెగ సందడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆహా టీమ్ చేసిన ఫిర్యాదుతో ఈ ఎపిసోడ్ లింక్‌లు తొలగించారు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 స్ట్రీమింగ్

ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 స్ట్రీమింగ్

'Unstoppable with NBK 2' షోలో తాజాగా స్ట్రీమింగ్ అవుతోన్న ఎపిసోడ్‌లో పాన్ ఇండియా స్టార్‌ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్టుగా వచ్చాడు. అతడికి భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చి మరీ హోస్ట్ నటసింహా నందమూరి బాలకృష్ణ షోలోకి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రభాస్‌తో తనదైన శైలిలో మాట్లాడుతూ, ఆటలాడుతూ ఓ రేంజ్‌లో మజాను పంచారాయన.

సర్వర్ ప్రాబ్లం.. అయినా రికార్డు

సర్వర్ ప్రాబ్లం.. అయినా రికార్డు

'Unstoppable with NBK 2' షోలో ప్రభాస్ గెస్టుగా వచ్చిన ఎపిసోడ్‌ను అప్‌లోడ్ చేసిన కొద్ది సమయంలోనే దీనికి యూజర్ల తాకిడి భారీగా పెరిగిపోయింది. దీంతో ఆహా సర్వర్లు అన్నీ స్టక్ అయిపోయాయి. దీంతో చాలా సేపు ఈ ఎపిసోడ్ ఓపెన్ కాలేదు. అయినప్పటికీ ప్రభాస్ ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా దక్కాయి.

ఎపిసోడ్ లీక్.. రికార్డులపై ఎఫెక్ట్

ఎపిసోడ్ లీక్.. రికార్డులపై ఎఫెక్ట్

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పైరసీ చేయడం మరింత సులభం అయిపోయింది. అలా స్ట్రీమింగ్‌కు వచ్చిన వెంటనే కొందరు సైబర్ నేరగాళ్లు ఆ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేస్తున్నారు. ఇలా ఇప్పుడు ప్రభాస్‌తో బాలయ్య చేసిన 'Unstoppable with NBK 2' ఎపిసోడ్‌ను కూడా లీక్ చేశారు. దీంతో రికార్డులపై ఇది తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది.

 హైకోర్టులో ఆహా టీమ్ పిటీషన్

హైకోర్టులో ఆహా టీమ్ పిటీషన్

ప్రభాస్ 'Unstoppable with NBK 2' ఎపిసోడ్‌తో పాటు ఆహాలోని కంటెంట్ పైరసీ అవుతోన్న నేపథ్యంలో అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆహాలోని కంటెంట్‌ను వేరే సైట్లలో పోస్ట్ చేయడం వల్ల తమకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందని.. కాబట్టి ఆ అనధికారిక లింకులను తొలగించాలని పిటీషన్‌ వేసింది.

తొలగించాలని హైకోర్టు ఆదేశం

తొలగించాలని హైకోర్టు ఆదేశం

ఆహా పిటీషన్‌పై విచారించిన జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ ధర్మాసనం.. 'ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా డైనమిక్ ఇంజక్షన్ ఇవ్వకపోతే ఫిర్యాదుదారుడికి భారీ నష్టం వాటిల్లుతుంది కాబట్టి టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఆ అనధికారిక లింకులు తొలగించాలి' అని ఆదేశించింది.

 లింకులపై చర్యలు చేపట్టారు

లింకులపై చర్యలు చేపట్టారు

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఆహా టీమ్ పిటీషన్‌లో పేర్కొన్న లింకులను కొన్ని వెబ్‌సైట్ల నుంచి తొలిగించే చర్యలను వెంటనే మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకూ వెబ్‌సైట్లలో ఆహా టీమ్‌కు సంబంధించిన కంటెంట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.

ఆలస్యంగా మేలుకొన్న ఆహా

ఆలస్యంగా మేలుకొన్న ఆహా

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లు అనధికారిక లింకులను తొలగించడంతో లీకు వీరులకు బిగ్ షాక్ తగిలినట్లైంది. ఇదిలా ఉండగా.. ఈ లీకుల వల్ల ప్రభాస్ ఎపిసోడ్‌కు తీవ్ర నష్టమే జరిగిందని చెప్పొచ్చు. ఒకవేళ పైరసీ లేకుండా ఉంటే రికార్డులన్నీ బద్దలయ్యే ఛాన్స్ ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X