This Week OTT Releases: ముఫాసా ది లైన్ కింగ్, ఇంకా.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
కోవిడ్ తర్వాత ఓటీటీ రంగం బాగా వృద్ది చెందింది. అనేక పేరున్న సంస్థలు ఈ రంగంలోకి రావడంతో పోటీ కూడా ఎక్కువైంది. కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం ఆలస్యం వాటి డిజిటల్ రైట్స్ కోసం ఆయా కంపెనీలు ఎగబడుతున్నాయి. చిన్నా చితకా సినిమాలైతే వారం తిరిగేసరికి ఓటీటీలలో ప్రత్యక్షమవుతున్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటీటీ సంస్థలు ప్రతివారం రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలను ముందే ప్రకటిస్తున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు, ఏయే ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదలవుతున్నాయో చూస్తే :

మార్చి నెలాఖరులో ప్రఖ్యాత యానిమేటింగ్ చిత్రం ముఫాసా ది లయన్ కింగ్, అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ యూ సీజన్ 5, తమిళ చిత్రం విడుతలై పార్ట్ 2 (హిందీ వెర్షన్) తదితర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి 24 నుంచి మార్చి 30 వరకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల అవుతున్న చిత్రాలను పరిశీలిస్తే:
ముఫాసా ది లయన్ కింగ్ :
హాలీవుడ్ సంస్థ డిస్నీ రూపొందించిన ఈ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ రిలీజై మంచి ఆదరణను పొందింది. ఈ సినిమాలో ముఫాసా పాత్రకు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు .. హిందీలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా జియో హాట్ స్టార్ వేదికగా మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని జియో హాట్ స్టార్ తెలిపింది.
డెలులూ ఎక్స్‌ప్రెస్ :
స్టాండప్ కమెడియన్ జకీర్ ఖాన్ నటించిన కమెడి స్పెషల్ డెలులూ ఎక్స్‌ప్రెస్ మార్చి 27 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఓం కాళీ జై కాళీ :
దసరాను పురస్కరించుకుని 1995లో తమిళనాడులో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓం కాళీ జై కాళీ వెబ్ సిరీస్ మార్చి 28 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. విమల్, గంజ కరుప్పు, పావని రెడ్డిలు కీలకపాత్ర పోషించారు.
విడుదలై 2 (హిందీ) :
2023లో వచ్చిన విడుదలై పార్ట్ 1కి సీక్వెల్‌కి తెరెక్కిన విడుదలై పార్ట్ 2ని వెట్రిమారన్ రూపొందించారు. గతేడాది చివరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. భవానీ శ్రీ , మంజు వారియర్, సూరి, సూర్య సేతుపతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. విడుదలై 2 హిందీ వెర్షన్ జీ 5లో మార్చి 28 నుంచి అందుబాటులో ఉండదనుంది.
మిస్టర్ హౌస్ కీపింగ్ :
అరుణ్ రవిచంద్రన్ దర్శకత్వంలో హరి భాస్కర్, లోస్లియా మరియనేసన్, ఇళవరసు, రాయన్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మిస్టర్ హౌస్ కీపింగ్ . ఈ ఏడాది జనవరి 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మార్చి 25 నుంచి టెంట్ కొట్టాలో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











