This Week OTT Releases: సినీ ప్రియులకి పండుగే.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

This Week OTT Releases: రోజురోజుకు ఓటీటీల క్రేజ్ పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాల కంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రేక్షకులు మక్కువ చూపిస్తున్నారు. దీంతో ప్రతి వారం కొత్త సినిమాలు, కొత్త సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా భారీ మొత్తంలో సినిమాలు ఓటీటీలోకి వచ్చి పడుతున్నాయి. మరి ఏ సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక లుక్కేద్దాం.

ఈ వారం ఓటిటిలోకి అడుగు పెట్టడానికి కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. దీపావళి పండుగ కానుక థియేటర్లలో సందడి చేయడానికి 'లక్కీ భాస్కర్','క' లాంటి తెలుగు సినిమాలతో పాటు అమరన్, బఘీరా లాంటి డబ్బింగ్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే.. భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్ లాంటి హిందీ సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఓటిటిలోకి ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు అడుగు పెట్టబోతున్నాయి. ఈవారం ఓటీడీలో రిలీజయ్యే వాటిలో లబ్బర్ పందు, కిష్కిందా కాండం, తంగలాన్ లాంటి డబ్బింగ్ మూవీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద సబ్‌స్టాన్స్' అనే ఇంగ్లీష్ సినిమా ఉంది. మరి ఏ ఓటీటీలో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే..?

Details of movies and web series streaming on Netflix Prime Disney Hotstar Jio Cinema Amazon Prime Video in last week of October 2024

తంగలాన్ (Thangalaan)

తమిళ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్- సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ కాంబో‌లో తెరకెక్కిన సినిమా 'తంగలాన్'(Thangalaan). పీరియాడికల్ అడ్వెంచెరస్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న వర్డల్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీని 'స్టూడియో గ్రీన్'బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ మూవీలో హీరో విక్రమ్ కు జంటగా పార్వతి నటించగా, మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 31 నుంచి నెట్ ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ అవుతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు.

Details of movies and web series streaming on Netflix Prime Disney Hotstar Jio Cinema Amazon Prime Video in last week of October 2024

లబ్బర్ పందు (Lubber Pandhu)

కోలీవుడ్‌లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం 'లబ్బర్‌ పందు'. ఈ మూవీ సెప్టెంబర్‌ 20న విడుదలైంది. ఈ మూవీలో పెద్దగా ఫేమ్‌ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. పైగా.. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్‌ పందు' చోటు సంపాదించుకుంది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్‌తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్‌లో అక్టోబర్‌ 31 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Details of movies and web series streaming on Netflix Prime Disney Hotstar Jio Cinema Amazon Prime Video in last week of October 2024

కిష్కింద కాండం

మ‌ల‌యాళంలో చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని అందుకున్న సినిమా కిష్కింద‌కాండం. ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీకి దిన్జీత్ అయ్య‌థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇన్వేస్టిగేష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో ఆడియెన్స్‌ను అల‌రించింది. ఈ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ నవంబర్ 1 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నది.

హాట్‌స్టార్ (Hotstar)

విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30
లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 31
కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 01

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

ద మ్యాన్‌హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ (ఇంగ్లీష్) అక్టోబర్ 30
టైమ్ కట్ (ఇంగ్లీష్ ) - అక్టోబర్ 30
మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ సిరీస్) - అక్టోబర్ 31
తంగలాన్ (తెలుగు డబ్బింగ్ ) - అక్టోబర్ 31
బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 01

జీ 5 (zee 5)

సామ్ బహదూర్ సీజన్ 3 (ఇంగ్లీష్) - అక్టోబర్ 28
మిథ్య: ద డార్క్ చాప్టర్ (హిందీ ) - నవంబరు 01

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 29

ఆహా ( Aha)

అంజమా (తమిళ చిత్రం) - అక్టోబర్ 29
అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - అక్టోబర్ 31

బీసీ(BeeCee)

సివిల్ ఇంజినీర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

More from Filmibeat

Read more about: ott netflix aha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X