ఓటీటీలో దేవర డిజాస్టరా? ఎన్టీఆర్ మూవీపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్

ఈ 2024 ఏడాది ఇపుడు దాదాపు ముగింపుకి వచ్చేసింది. కాగా ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి ఎన్నెనో బిగ్ హిట్స్ సహా భారీ డిజాస్టర్ సినిమాలు కూడా వచ్చాయి. అయితే మిగతా ఏళ్ళతో పోలిస్తే ఈ ఏడాదిలో మాత్రం మన తెలుగు బిగ్ స్టార్స్ సినిమాలు ఒకింత తక్కువే ఉన్నాయని చెప్పాలి.

ఏడాది స్టార్టింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు "గుంటూరు కారం", మధ్యలో జూన్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" ఇక దీని తర్వాత ద్వితీయార్ధంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేసిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా "దేవర" సినిమా అని చెప్పాలి. కాగా వీటిలో ఒక్క కల్కి మినహా రెండు సినిమాలకి అంత పాజిటివ్ టాక్ పడలేదు.

Devara not Impressive after OTT Release Fans trolling Jr NTR This reason

అయినా కూడా వీటిలో ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా మాత్రం ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టింది అని మేకర్స్ చెప్పుకున్నారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా పైగా దర్శకుడు కొరటాల శివతో చేసిన రెండో సినిమా కాగా ఇది ఎన్నో అంచనాలు నడుమ వచ్చినప్పటికీ థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ నే అందుకుంది. ఐతే దేవర విషయంలో మొదటి నుంచీ ఓ కంప్లైంట్ ఉంది.

ఈ సినిమాకి ఇండియా వైడ్ జరిగిన బుకింగ్స్ కి మేకర్స్ వేసుకుంటున్న నంబర్స్ కి చాలా తేడా ఉందని పలు కామెంట్స్ ఉన్నాయి. థియేటర్స్ లో అంత ఆదరణ లేకపోయినప్పటికీ దేవర అంత ఎలా వసూలు చేస్తుంది అంటూ చాలానే లాజిక్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే సినిమా ఓటిటి విడుదలకి కూడా వచ్చేసింది. కాగా ఈ సినిమా ఓటిటిలో వచ్చాక మాత్రం బిగ్ ట్విస్ట్ నే ఎదుర్కొంది అని చెప్పాలి.

Devara not Impressive after OTT Release Fans trolling Jr NTR This reason

ఈ సినిమాని ఎవరో కూడా ఎన్టీఆర్ అభిమానులే రిజెక్ట్ చేసేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కనిపిస్తున్నాయి. రిలీజ్ కి ముందు సినిమాని రెండు భాగాలుగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే లాంటి పాత కామెంట్స్ ని దర్శకుడు నిర్మాతలు ఇచ్చిన హైప్ ని చూసి దేవర ఏదో వరల్డ్ లెవెల్లో ఉంటుంది అనుకున్నామని కానీ మాకు ఇలాంటి పూర్ రైటింగ్ తో కూడిన సినిమా పైగా దీనికి సీక్వెల్ కూడా ఇస్తారా అంటూ సదరు తారక్ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఓటిటిలో వచ్చాక పలు సన్నివేశాలపై అయితే దారుణంగా ట్రోల్స్ కూడా పడుతున్నాయి. ఎన్టీఆర్ కంటైనర్ లని తోసే సీన్ కానీ వర పాత్ర సొర చేపని లాక్కొచ్చే సీన్ అలాగే ఎన్టీఆర్ పై ఎంతో కృత్రిమంగా చేసిన వాటర్ జంప్ సీన్స్ వంటి వాటిపై ట్రోల్స్ పడుతున్నాయి. కాగా ఇవన్నీ చూస్తుంటే దేవర సినిమాని చాలా మంది ఇపుడు ఓటిటి రిలీజ్ అయ్యాకే చూసినట్టుగా కనిపిస్తుంది. మరి తారక్ అభిమానులు అప్పుడు థియేటర్స్ లో ఉన్నపుడు సినిమాని ఎంతో డిఫెండ్ చేసుకొని ఇపుడు ఓటిటిలో వచ్చాక ఇంతలా మాట్లాడ్డం ఇపుడు ఇతర హీరోల అభిమానులకి కూడా ఆశ్చర్యం కలిగించడం విశేషం.ఇదిలా ఉండగా ఓటీటీలో ఈ సినిమాకు అంతగా రెస్సాన్ రావడం లేదనే విషయం మరింత ఆశ్చర్యకరంగా మారింది.

More from Filmibeat

Read more about: ntr janhvi kapoor devara ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X