Devara: ఓటిటిలో దేవర రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగు, హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం బిగ్ స్క్రీన్స్ పై సినిమాల కోసం ఆడియెన్స్ ని తీసుకు రావడం అనేది పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఒకప్పుడు అంటే థియేటర్స్ లోకి జనాలు డే 1 ఎలాంటి సినిమా అయినా మినిమం వచ్చే వారు. ఇక టాక్ పడితే దానికి లాంగ్ రన్ కూడా బాగానే ఉండేది. అలాగే కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు కూడా బాగానే రన్ అయ్యేవి. ఎప్పుడైతే ఓటీటీ హవా మొదలైందో ఇదంతా తలకిందులు అయ్యింది.

కాగా ఒకప్పుడు అసలు ఓటీటీలు లేని సమయంలోనే సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి నుంచి ఇపుడు ఓటీటీ డీల్ అయ్యాకే విడుదల అయ్యే స్థితికి వచ్చాయి. ఇలా ఓటీటీ అలవాటుతో ఆడియెన్స్ థియేటర్స్ కి రావడం కూడా బాగా తగ్గించేశారు. ఇక్కడ నుంచి మొదలైంది అసలు తంతు. జనం థియేటర్లుకి రావడం మానేశారు. నిర్మాతలు ఏమో సినిమాలు మినిమం 4 వారాల్లోపే సినిమాలు ఓటీటీకి ఇచ్చేస్తున్నారు దీనితో ఏ సినిమా వచ్చినా నాలుగు వారాలు ఆగితే చాల్లే అన్నట్టు ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

Devara OTT Release date fixed Telugu and Hindi version will stream on this day

దీనితో పలు సినిమాలకి మా సినిమా ఇన్ని వారాల వరకు ఓటీటీలో రాదు సో చూడాలి అనుకుంటే ముందు థియేటర్స్ లోనే చూడండి అంటూ పలు సినిమాలు ముందే చెప్పేస్తున్నాయి. అలా చెప్పిన రీసెంట్ సినిమాల్లో 'దేవర' కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తో చేసిన రెండో సినిమాగా ఇది పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది.

అయితే ఈ సినిమా ఓటీటీలో 50 రోజులు లేదా 7 వారాలు తర్వాత మాత్రమే వస్తుంది అని అప్పుడే సినీ వర్గాలు తేల్చేసాయి. అలానే ఇపుడు దేవర రెండు రకాలుగా ఓటీటీలో విడుదలకి రెడి అవుతున్నట్టు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా లేటెస్ట్ రూమర్స్ ప్రకారం దేవర మొదట 7 వారాల థియేటర్స్ రన్ తర్వాత నవంబర్ మిడ్ లో సౌత్ భాషల్లో అందుబాటులో ఉంటుంది అని తెలుస్తోంది.

Devara OTT Release date fixed Telugu and Hindi version will stream on this day

అలాగే హిందీ రిలీజ్ విషయంలో అప్పుడే చేసుకున్న 8 వారాల అగ్రిమెంట్ తర్వాత నవంబర్ 22న అయితే హిందీలో రాబోతుంది అని వినిపిస్తుంది. కాగా హిందీ సహా తెలుగు అన్ని భాషల్లో దేవర సినిమాను వరల్డ్ పాపులర్ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ రికార్డ్ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా ఇందులో నవంబర్ 22 లోపు అలా దేవర రెండు సార్లు ఓటీటీ ఇవ్వబోతోంది అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది అలాగే అనిరుద్ సెన్సేషనల్ మ్యూజిక్ ఈ చిత్రానికి అందించాడు. అలానే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అలాగే పార్ట్ 1 ఆల్రెడీ 500 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: ntr devara koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X