Devara on OTT: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. డైరెక్టర్‌ కట్‌తో ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?

ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి వచ్చిన దాదాపు అన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా మంచి సక్సెస్ ని చూశాయి అని చెప్పొచ్చు. అయితే మెయిన్ గా తెలుగు సహా హిందీ మార్కెట్ లో మన స్టార్స్ సినిమాలు బాగానే రాణించాయి. జనవరిలో హను మాన్ నుంచి జూన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఎడి వరకు వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమాలు రికార్డు వసూళ్లు అది కూడా లాంగ్ రన్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసాయి.

ఇక ఈ సినిమాలు కాకుండా వచ్చిన మరో పాన్ ఇండియా ప్రముఖ సినిమానే "దేవర". పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహించారు. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాతోనే ఆమె తెలుగు ఎంట్రీ కూడా ఇచ్చింది.

Devara OTT Release date officially announce by Netflix

అయితే ఈ సినిమాకి అనుకున్న రేంజ్ పాజిటివ్ టాక్ రాలేదు కానీ ఆ టాక్ లో కూడా మంచి బుకింగ్స్ ని సినిమా తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఇలా దాదాపు నెల రోజులు వరకు మంచి రన్ ని తెలుగు స్టేట్స్ లో కొనసాగించింది. అలాగే హిందీలో కూడా 80 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లోనూ సత్తా చాటింది.

ఇలా వారాలు గడిచే కొద్దీ కొత్త సినిమాలు వచ్చేసాయి. దీనితో దేవర లాంగ్ రన్ కూడా పూర్తయ్యిపోయింది. ఇక మిగిలి ఉన్నది ఓటిటి రిలీజ్ ఒక్కటే.. కాగా దేవర సినిమాని ఏకంగా 150 కోట్లకి పైగా వెచ్చించి ప్రపంచ పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అది కూడా పాన్ ఇండియా భాషల్లో అని తెలిసిందే.

Devara OTT Release date officially announce by Netflix

కాగా ఇందులోనే ఎప్పుడో కాదు ఈ నవంబర్ 8 నుంచే సినిమా వచ్చేస్తుంది అని మేము తెలిపాము. మరి ఇపుడు చెప్పినట్టుగానే దేవర సినిమా ఈ నవంబర్ 8 నుంచే నెట్ ఫ్లిక్స్ లో ఓటిటిలో వస్తున్నట్టుగా వారు కన్ఫర్మ్ చేసేసారు. ఐతే నెట్ ఫ్లిక్స్ లో సినిమా ఓ డిఫరెంట్ కట్ తో వస్తుందా అనేది అనుమానంగా మారింది.

కాగా దేవర సినిమా బిగ్ స్క్రీన్స్ మీదే దావుది సాంగ్ లేకుండానే 2 గంటల 55 నిమిషాల నిడివితో విడుదల చేశారు. తర్వాత సాంగ్ యాడ్ చేయడంతో దాదాపు మూడు గంటల సినిమా అయ్యిపోయింది. కానీ ఇపుడు ఓటిటికి ఈ రెండు వెర్షన్ లు కూడా రావడం లేదు. నెట్ ఫ్లిక్స్ లో దేవర కేవలం 2 గంటల 5 నిమిషాల నిడివి తోనే వస్తుంది. అంటే సినిమాలో చాలానే సీన్స్ లేవు అనుకోవాలని చెప్పక తప్పదు. మరి ఓటిటిలో దేవరకి ఇంత డిఫరెన్స్ ఎందుకు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: ntr janhvi kapoor devara ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X