Devara OTT: ఓటీటీలో ఎన్టీఆర్ ‘దేవర’.. ఆ పండగ స్పెషల్‌గా స్ట్రీమింగ్..
Devara OTT: ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ 'దేవర'. కొరటాల శివ- తారక్ కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేస్తోంది.ఈ క్రమంలో మూవీ నుంచి ఓటీటీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఓటీటీలో ఎప్పటీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే విషయం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దేవర ఓటీటీ అప్డేట్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండీ.
దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్నఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక్కడ బడ్జెట్ పరంగా చూస్తే.. ఈ మూవీకి సూమారు రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దేవర మూవీ తారక్ సినిమాల్లో వన్ ఆఫ్ ది భారీ బడ్జెట్ మూవీగా చెప్పవచ్చు. ఈ భారీ బడ్జెట్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

పాన్ ఇండియా విడుదలైన దేవర ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేయగా.. బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ విడుదల చేశారు. ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా విడుదల చేశారు. ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడం, ఈ భారీ బడ్జెట్ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్ నటులు నటించడం, విడుదలకు ముందే ఎన్నో హైప్స్ క్రియేట్ అయ్యాయి.
భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలోని గత రికార్డులను తిరగరాసేస్తోంది. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ , ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ భారీ కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ 400 కోట్ల కలెక్షన్ మార్క్ దాటి రూ.500 కోట్లకు చేరవయ్యాయి. రెండో వారంలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది ఈ తరుణంలో
దేవర ఓటీటీ స్ట్రీమింగ్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టంట చక్కర్లు కొడుతోంది.

మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. దేవర డిజిటల్ రైట్స్ ను Netflix సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 155 కోట్లు వెచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కలిపి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ ఇక స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. థియేటర్లలో 'దేవర' విడుదల అయిన 50 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. అంటే నవంబర్ 15 తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. దీపావళి పండుగ సందర్బంగా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











