Devara OTT: దేవర నుండి మరో క్రేజీ అప్డేట్.. ఓటీటీ స్టీమింగ్ ఎప్పుడంటే?

Devara OTT: 2024లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' ఒకటి. కొరటాల శివ- తారక్ కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కావడంతో దేవర మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీ బిజీ అయ్యింది. ఈ క్రమంలో మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ భారీ బడ్జెట్ మూవీ మరో రెండు రోజుల్లో థియోటర్లలో విడుదల కాగా.. ఓటీటీలో ఎప్పటీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే విషయం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దేవర ఓటీటీ అప్డేట్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండీ.

దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న మూవీ దేవర. ఈ మూవీని ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక్కడ బడ్జెట్ పరంగా చూస్తే.. ఈ మూవీకి సూమారు రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.తారక్ సినిమాల్లో వన్ ఆఫ్ ది భారీ బడ్జెట్ మూవీగా చెప్పవచ్చు. ఈ భారీ బడ్జెట్ మూవీతో నిర్మించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

Devara OTT release update will be released on OTT 50 days after its theatrical release

ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడం, ఈ మాస్ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్ నటులు నటిస్తుండటం, అలాగే.. ఇప్పటివరకు దేవర మూవీ నుంచి విడుదలైన సాంగ్స్,గ్లింప్స్ ,ట్రైలర్స్ భారీ రెస్పాన్స్ వస్తుండటం, ఇప్పటికే ట్రైలర్స్ పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇలా ట్రైలర్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో తారక్‌ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మూవీ మేకర్స్. ఈ మూవీ కోసం కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర పాన్‌ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తుండగా.. బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఇక దేవర అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తూ అదరగొడుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా నెల రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి.

Devara OTT release update will be released on OTT 50 days after its theatrical release

ఇదిలా ఉంటే.. దేవర డిజిటల్ రైట్స్ కు సంబంధించి లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేవర ఓటిటి రైట్స్ ను Netflix ఓటిటి సంస్ద దేవర మూవీ ఓటిటి రైట్స్ కోసం దాదాపు రూ. 155 కోట్లు వెచ్చినట్టు తెలుస్తోంది. అంటే.. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కలిపి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం రూ.155 కోట్లు ఖర్చుపెట్టిందని సమాచారం. ఈ ఇక స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. థియేటర్లలో 'దేవర' విడుదల అయిన 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కావాలని అగ్రిమెంట్ కూడా జరిగిందని తెలుస్తోంది. అంటే నవంబర్ 16 తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

More from Filmibeat

Read more about: devara ott jr ntr netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X