ఓటీటీలోకి సంతానం హార్రర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడంటే?

తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు తమిళ హాస్య నటుడు సంతానం. తనకున్న క్రేజ్‌తో ఈయన ఏకంగా హీరోగా మారిపోయారు. హీరోగా బిజీ అయినప్పటికీ.. తనలోని కమెడియన్‌ని మాత్రం విడిచిపెట్టలేదు. మధ్య మధ్యలో పలు చిత్రాలకు కమెడియన్‌గా చేస్తూనే ఉన్నారు. తాజాగా సంతానం హీరోగా తెరకెక్కిన చిత్రం డీడీ నెక్ట్స్ లెవల్. హార్రర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

హీరోగా బీజీ అవుతోన్న సంతానం
సంతానం సరసన గీతికా తివారీ హీరోయిన్‌గా నటించగా.. సెల్వ రాఘవన్, గౌతం మీనన్, కస్తూరి, యాషిక ఆనంద్, రాజేంద్రన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ది షో పీపుల్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి, ఆర్య దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఓఫ్రో స్వరాలు సమకూర్చారు. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో డీడీ నెక్ట్స్ లెవల్ టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఓ సాంగ్‌ని విడుదల చేసింది.

Devil s Double Next Level OTT Release when to expect Santhanam s movie to stream online

పాటతో వివాదం
అయితే ఈ పాటలో తిరుమల శ్రీవారికి సంబంధించిన గోవింద నామాలు ఉపయోగించడం వివాదాస్పదమైంది. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్‌కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సాగే ఈ పాటకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరుమల శ్రీవారిపై పేరడీ సాంగ్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ చిత్ర యూనిట్‌పై తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీనిపై ఓ కార్యక్రమంలో స్పందించిన హీరో సంతానం.. ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేశారు. తిరుమల శ్రీవారిపై తనకు ఎంతో భక్తి ఉందని.. ఆయనపై పాటలో తప్పుగా ఎలాంటి పదాలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు.

బాక్సాఫీస్ వద్ద వసూళ్లు
మే 16న విడుదలైన డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ మూవీకి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఫస్ట్ డే ఏకంగా రూ.3 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన సంతానం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాడు. తొలివారం ఏకంగా రూ.13.89 కోట్లు, రెండో వారం రూ.3.70 కోట్లు చొప్పున 25 రోజుల వరకు సంతానం సినిమా ఇండియా వైడ్‌గా రూ.18.29 కోట్ల నెట్, రూ.21.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. శాటిలైట్, ఓటీటీ, ఆడియో రైట్స్‌తో డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ మూవీతో నిర్మాతకు సంతానం మంచి లాభాలు అందించాడని విశ్లేషకులు చెబుతున్నారు.

ఓటీటీ వివరాలు ఇవిగో
అటు సంతానం సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై జీ5 క్లారిటీ ఇచ్చింది. జూన్ 13 నుంచి సంతానం మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని జీ5 అధికారికంగా ప్రకటించింది. థియేటర్‌లలో రిలీజై నవ్వులు ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: santhanam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X