Dhadak 2 OTT: ఓటీటీలోకి ధడక్ 2 .. తృప్తి దిమ్రి లవ్‌స్టోరీ ఎందులో? ఎప్పుడంటే?
యానిమల్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు తృప్తి దిమ్రి. వరుస సినిమాలతో నేషనల్ క్రష్‌గా నిలిచారు. తృప్తి నటించిన సినిమాలకు బాలీవుడ్‌తో పాటు ఇతర పరిశ్రమలలోనూ మంచి హైప్ వస్తోంది. తాజాగా తృప్తి దిమ్రి నటించిన చిత్రం ధడక్ 2. సిద్ధాంత్ చతుర్వేది ఇందులో హీరోగా నటించగా.. షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 1న ధడక్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వివరాలు చూస్తే.
ధడక్‌కు సీక్వెల్‌గా ధడక్ 2
2018లో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన ధడక్‌కు స్పిరిచ్యువల్ సీక్వెల్‌గా, పరియారం పెరుమాల్ అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా ధడక్ 2 చిత్రం తెరకెక్కింది. జాకీర్ హుస్సేన్, సౌరబ్ సచ్‌దేవ, దీక్షా జోషి, విపిన్ శర్మ, సాద్ బిల్‌గ్రామి, హరీష్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఉమేష్ కుమార్ బన్సాల్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, మీనూ అరోరా, సొమెన్ మిశ్రా, ప్రగతి దేశ్‌ముఖ్‌లు నిర్మాతలుగా వ్యహరించారు.

ధడక్ 2 బడ్జెట్ ఎంత?
తనుజ్ టికూ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా.. రోచక్ కోహ్లి, తనిష్క్ బాగ్చి, జావెద్ మోహిసిన్, శ్రేయాస్ పుర్నిక్‌లు స్వరాలు సమకూర్చారు. సిల్వస్టర్ ఫోన్సెకా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో జరిగే కథ అయినప్పటికీ.. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ధడక్ 2ను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన ఖర్చు కలిపి ధడక్ 2 చిత్రానికి రూ.55 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ధడక్ 2 బాక్సాఫీస్ అంచనా
బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2తో ఈ సినిమాకు పెద్ద పోటీ ఎదురవుతోంది. మరోవైపు.. ఇప్పటికే థియేటర్‌లలో ఉన్న రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారాను కూడా ఎదుర్కోవాల్సి ఉంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ధడక్ 2కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చెన్నై, కోల్‌కతా, జైపూర్ నగరాలలో ఈ సినిమాకు మంచి బుకింగ్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు ఉన్న షోలకు బుక్ మై షో యాప్‌లో టికెట్ బుకింగ్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇతర షోలకు కూడా బుకింగ్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ధడక్ 2కి తొలిరోజు 7 కోట్ల వరకు ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ధడక్ 2 ఏ ఓటీటీలో అంటే?
ఇకపోతే.. ధడక్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ గురించి పరిశీలిస్తే.. తృప్తి దిమ్రి క్రేజ్ నేపథ్యంలో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని బాలీవుడ్ టాక్. అయితే ఈ డీల్ ఎంత మొత్తానికి క్లోజ్ అయ్యిందనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లలో విడుదలైన 8 వారాలు (60 రోజులు)తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన మీద నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి ధడక్ 2 చిత్రం అక్టోబర్‌లో ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











