Dhandoraa OTT Release: ఆ ఓటీటీ చేతికి దండోరా.. శివాజీ మూవీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడంటే?
కోర్ట్ మూవీ ఘన విజయం సాధించడం, అందులోని మంగపతి పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో హీరో శివాజీకి ఇటీవలి కాలంలో మంచి పాత్రలు పడుతున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం దండోరా. టీజర్, ట్రైలర్‌లతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే దండోరా సినిమా ఏ ఓటీటీలో రానుంది? స్ట్రీమింగ్ ఎప్పుడు? కానుంది అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..
దండోరా తారాగణం
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన చిత్రం దండోరా. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గారపు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో దండోరా సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

దండోరా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి దండోరా చిత్రానికి 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా నిర్మాతలు రాజీపడలేదు. సినిమాటిక్ అనుభూతి కోసం పూర్తి గ్రామీణ వాతావరణంలో దండోరా చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలతో దండోరా సినిమాపై హైప్ క్రియేట్ అవ్వడంతో పాటు అందరి దృష్టి నెలకొంది.
దండోరా బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత?
దండోరా చిత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. శివాజీ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు. శుక్రవారం దండోరాతో పాటు శంబాల, ఈషా, ఛాంపియన్, వృషభ తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో దండోరా సినిమా ఏ మేరకు పోటీలో నిలబడుతుందో చూడాలి.
దండోరా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
ఇక దండోరా సినిమా ఓటీటీ వివరాలు పరిశీలిస్తే.. శివాజీ, బిందు మాధవిల సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. థియేటర్‌లలో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు దండోరా డిజిటల్ డీల్ కుదిరింది. దీని ప్రకారం జనవరి మూడో వారంలో శివాజీ నటించిన చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి దండోరా మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు.. లేదా ముందుగా రావొచ్చు. దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











