15 రోజుల్లోనే OTTలోకి రాబోతున్న ధనుష్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా సినిమాలకు తేడా లేకుండా.. అన్నీ నెలరోజుల్లోపో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయినా సరే వెంటనే డిజిటల్ వేధికగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇటీవలే విడుదల అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా కేవలం 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమా ఏంటి ఎప్పటి నుంచి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుష్ హీరోగా వచ్చిన తాజా సినిమా కెప్టెన్ మిల్లర్. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాను తెలుగులో మాత్రం చాలా ఆలస్యంగా విడుదల చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో చిత్రబృందం ఈ తెలుగులో మాత్రం ఈ సినిమాను వాయిదా వేసింది. తమిళ్ లో కెప్టెన్ మిల్లర్ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచంది. జనవరి 25వ తేదీన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల అయి పాజిటివ్ టాక్ యే తెచ్చుకుంది.

ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, జాన్ కొక్కెన్ మరియు ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది.

ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఎందుకు ఆలస్యం తెలుగులో విడుదల అయి 15 రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











