Kalki 2898 AD Vs Raayan: ఓటీటీలో కల్కికి షాకిచ్చిన రాయన్.. ప్రభాస్‌ కంటే ధనుష్ మూవీ రికార్డుల మోత!

ఈ ఏడాదిలో సౌత్ సినిమా దగ్గర వచ్చిన అనేక చిత్రాల్లో బాక్సాఫీస్ పరంగా హిట్ సినిమాలు అన్ని అంటే వేళ్ళ మీదే లెక్కేసి చెప్పేయవచ్చు. అంత తక్కువ సక్సెస్ రేట్ అయితే ఈ ఏడాది సౌత్ సినిమా దగ్గర నమోదు అయ్యింది. మొదటి మూడు నెలల్లో కొన్ని సినిమాలు తప్ప తర్వాత అంతా డ్రై గానే నడిచింది. మళ్ళీ ఈ ఏడాది ప్రథమార్థం అవుతుంది అనే సమయంలో వచ్చిన పలు చిత్రాలు హిట్ అయ్యాయి.

తెలుగు సహా తమిళ్ నుంచి పలు చిత్రాలు వచ్చి హిట్ కాగా ఈ చిత్రాల్లో జూన్ మిడ్ నుంచి విజయ్ సేతుపతి "మహారాజ" అదరగొడితే అదే నెల చివరన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" వచ్చి మరో నెల రోజులు వరకు సెన్సేషనల్ రన్ ని సొంతం చేసుకుంది. ఇలా థియేటర్స్ లో ఈ చిత్రం దాదాపు 5 వారాలకి పైగా సక్సెస్ ఫుల్ రన్ ని కంటిన్యూ చేసింది.

Dhanush Raayan dominates prabhas kalki 2898 ad in ott trending

మరి ఇలా కల్కి వచ్చిన నెల తర్వాత మరో తమిళ సినిమా థియేటర్స్ లోకి వచ్చి మంచి హిట్ అయ్యింది. కాగా ఆ సినిమానే తమిళ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన రివెంజ్ డ్రామా "రాయన్". అయితే ఈ సినిమా కూడా థియేటర్స్ లో మంచి వసూళ్లు అందుకుంది లాభాలు కూడా ఇచ్చేసింది. ఐతే అవ్వడానికి కల్కితో పోలిస్తే నెల రోజుల గ్యాప్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యినప్పటికీ ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే కేవలం ఒక్క రోజు గ్యాప్ లోనే రిలీజ్ కి వచ్చింది.

ఈ సినిమా పాన్ ఇండియా హక్కులు అలాగే కల్కి 2898 ఎడి సౌత్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. ఇందులో కల్కి ఆగస్టు 22న స్ట్రీమింగ్ కి వస్తే రాయన్ ఆగస్టు 23న స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల్లో ఎలా చూసుకున్నా కల్కి సినిమానే చాలా పెద్ద సినిమా ఇండియా వైడ్ గా రీచ్ ఉన్నది కూడా ఇదే అయినప్పటికీ ఓటిటిలో మాత్రం షాకింగ్ రెస్పాన్స్ అందుకుంది.

Dhanush Raayan dominates prabhas kalki 2898 ad in ott trending

మొదటి రోజుకి ప్రైమ్ వీడియోలో నెంబర్ 1 ట్రెండింగ్ కి వచ్చింది కానీ రెండో రోజుకి రాయన్ షాకిచ్చింది. అంత పెద్ద సినిమా పైగా కల్కి లో కమల్ హాసన్ కూడా ఉన్నాడు. అయినా కూడా కల్కి సినిమాని రాయన్ డామినేట్ చేసేసి దాన్ని వెనక్కి నెట్టి నెంబర్ 1 ప్లేస్ లో ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ అవుతుండడం షాకింగ్ గా మారింది.

చాలా మంది కల్కి సినిమాని దాటి రాయన్ ముందు వరుసలో ట్రెండ్ అవుతుండడం చూసి అవాక్కవుతున్నారు. అంతే కాకుండా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఒకింత షాకింగ్ గానే అనిపిస్తుంది. నిజానికి రాయన్ సినిమాకి కల్కి కి వచ్చిన రేంజ్ యునానిమస్ టాక్ కూడా రాలేదు.. అలాంటిది ఓటిటిలో మాత్రం రాయన్ ఈ రేంజ్ రచ్చ చేయడం ఆశ్చర్యకరమే అని చెప్పి తీరాలి.

More from Filmibeat

Read more about: dhanush raayan kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X