OTT: ధనుష్ "రాయన్" ఓటిటిలో పాన్ ఇండియా డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎందులో అంటే..
ఈ 2024 సినిమా సంవత్సరం అయితే ఒకింత ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పాలి. ఏడాది మొదటిలో బిగ్గెస్ట్ మూవీ ఫెస్టివల్ సంక్రాంతి బరిలో పలు చిత్రాలు దాదాపు సౌత్ లో అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా వచ్చి అదరగోట్టాయి. మెయిన్ గా మన తెలుగు సినిమా నుంచి హను మాన్, గుంటూరు కారం లాంటి సినిమాలు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ లుగా నిలవగా ఈ సినిమాలు తర్వాత ఫిబ్రవరి నుంచి ఒక మూడు నెలలు అలా మలయాళ సినిమా భారీ వసూళ్లతో పలు సినిమాలు రిలీజ్ చేసుకుంది.
కాగా కన్నడ నుంచి కూడా అక్కడ కొన్ని సినిమాలు బాగానే రాణించాయి. కానీ ఈ ఏడాదిలో తమిళ సినిమా పరిస్థితి మాత్రం కొంచెం దారుణంగానే ఉందని చెప్పాలి. దాదాపు ఏ స్టార్ హీరో సినిమా కూడా గత జూన్ వరకు రాలేదు. ఫిబ్రవరిలో రజినీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్ సలాం సినిమా భారీ డిజాస్టర్ అయ్యి కూర్చుంది. అక్కడ నుంచి కోలీవుడ్ లో గత జూన్ వరకు అయితే చాలా డ్రై వాతావరణమే నడిచింది.

కాగా జూన్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన "మహారాజ" సినిమాతో హిట్ కొట్టి 100 కోట్ల బాక్సాఫీస్ ఖాతాని ఓపెన్ చేసాడు. మరి మళ్ళీ తర్వాత మరో నోటెడ్ సినిమా తమిళ్ నుంచి కనిపించలేదు. మధ్యలో వచ్చిన ఉలగనయగన్ కమల్ హాసన్ శంకర్ ల ఇండియన్ 2 కూడా తేలిపోయింది. దీనితో ఫైనల్ గా కోలీవుడ్ ని ఆదుకున్న హీరోగా టాలెంటెడ్ నటుడు, దర్శకుడు ధనుష్ నిలిచాడు.
తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన రివెంజ్ యాక్షన్ డ్రామా "రాయన్" ని జూలై 26న రిలీజ్ కి తీసుకురాగా ఈ చిత్రం మంచి హిట్ అయ్యి ఇది కూడా 100 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టింది. తమిళ్ లో అయితే ఈ ఏడాదికి ప్రస్తుతం ఇదే హైయెస్ట్ గ్రాసర్ కూడా కాగా ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ధనుష్ ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు సహా హిందీలో అనౌన్స్ చేసాడు.

కానీ తెలుగు, తమిళ్ లో మాత్రమే చెప్పుకోదగ్గ రిలీజ్ కి ఇది నోచుకుంది. కానీ ఇప్పుడు ఓటిటిలో అయితే పాన్ ఇండియా భాషలు మొత్తం 5 భాషల్లో రాబోతున్నట్టుగా ఇపుడు అఫీషియల్ ప్రకటన వచ్చింది. కాగా ఈ సినిమాని పాపులర్ స్ట్రీమింగ్ హౌస్ అమేజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా వీరు నేడు బిగ్ అప్డేట్ అందించారు. దీనితో ఈ చిత్రం ఈ ఆగస్ట్ 23 నుంచి పాన్ ఇండియా భాషల్లో ప్రైమ్ లో అందుబాటులో ఉంటుంది అని ఇప్పుడు ఫిక్స్ అయ్యింది.
కాగా ఈ చిత్రం కూడా థియేటర్స్ లో వచ్చిన నెల లోపే వచ్చేస్తుండడం గమనార్హం. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో అయితే ఆరోజు నుంచి స్ట్రీమ్ కానుంది. కాగా ఈ చిత్రంలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి తదితరులు నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











