Raayan: ఊహించని ఓటీటీలో రాయన్.. అన్ని రోజులకే ధనుష్ మూవీ స్ట్రీమింగ్

విలక్షణ నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్. రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న అతడు.. 'సార్'తో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్నాడు. దీని తర్వాత మరింత జోష్‌తో ఉన్న ధనుష్ ఇప్పుడు 'రాయన్' మూవీ చేశాడు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రమే 'రాయన్'. కుటుంబ విలువలతో కూడిన మాస్ ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు, తమిళంతో పాటు తెలుగులోనూ దీన్ని హై రేంజ్‌లో రెడీ చేశారు.

Dhanush Starrer Raayan Movie OTT Partner and Streaming Date Details

ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ మాస్ స్టోరీతో రూపొందిన 'రాయన్' సినిమాను జూలై 26వ తేదీన అంటే నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మంచి స్పందన కూడా లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగానే లభించే అవకాశం ఉందని అంటున్నారు.

'రాయన్' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చేశాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ సన్ నెక్ట్స్ సంస్థ తీసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించడంతో డిజిటల్ హక్కులను అదే సంస్థ ఉంచుకున్నట్లు చెప్తున్నారు.

Dhanush Starrer Raayan Movie OTT Partner and Streaming Date Details

ధనుష్ హీరోగా నటించిన 'రాయన్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా సన్ నెక్ట్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ లీకైంది. అంటే జూలై 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా.. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'రాయన్' సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటించాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళిలు కీలక పాత్రలను పోషించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Read more about: raayan dhanush raayan movie ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X