OTTలోకి వచ్చేస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందంటే?
ఈ మధ్య కాలంలో అద్భుతమైన సినిమాలతో పాటు అంతకు మించిన వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీల వేదికగా సందడి చేస్తున్నాయి. సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో.. వెబ్ సిరీస్ లకు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుంది. అందువల్లే స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా హీరోయిన్ ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో రాబోతున్న సరికొత్త క్రైమ్ మూవీ పేరే శర్మ & అంబానీ. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణతో పాటు భరత్ తిప్పిరెడ్డి, కేశవ కర్రి, మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాలా, విశ్వనాథ్ మాండళిక, యష్. రూపక్, అభిషేక్, హనుమంత్ రావు, అవినాష్ దేవిరెడ్డి, స్మిత రామన్న, అవ్యుక్త్ తిప్పిరెడ్డి వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ సాయ్ ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే పార్వతీశం గురు, కార్తీక్ సాయి, భరత్ తిప్పిరెడ్డిలు ఈ చిత్రానికి రైటర్లుగా పని చేశారు.

అదిరిపోయే కామెడీతో పాటు అంతకు మించి క్రైమ్ చూపించబోతున్న ఈ సినిమాకు శశాంక్ ఆలమూరు, మహా సంగీతం అందిస్తున్నారు. ఏకే స్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా.. గౌతమ్ రాజు నెరుసు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదిరిపోయే కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో ఆయుర్వేదిక్ డాక్టర్ శర్మగా భరత్ తిప్పిరెడ్డి నటిస్తున్నారు. అలాగే ధన్య బాలకృష్ణ సితార పాత్రలో కనిపించబోతుండగా.. కేశవ్ క్రరి అంబానీ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.
అయితే అనుకోకుండా ఓ డేంజరస్ గ్యాంగ్ తో గొడవకు దిగిన శర్మ.. పోయిన వజ్రాలను దక్కించుకునే పాత్రలో కనిపించనున్నారు. ఈక్రమంలోనే ఈయన ధన్య బాలకృష్ణతో ప్రేమలో పడడం కూడా చూపిస్తారు. ఇలా ఆద్యంతం ఆకట్టుకునే కథాంశంతో రాబోతున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ వేదికగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ వేదికగా ఈ సంస్థ.. ఏప్రిల్ 11వ తేదీ నుంచి శర్మ & అంబానీ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది.
ముదిరిన ఎండల్లో బయట తిరగకుండా.. చల్లగా ఇంట్లోనే కూర్చుని ఈ అదిరిపోయే క్రైమ్ సినిమాను చూసేయండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఇది మాత్రమే కాకుండా ఈ వారం రాబోయే మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్టును కూడా తెలుసుకుని.. వీలు కుదిరినప్పుడల్లా చూసేయండి.


Click it and Unblock the Notifications











