ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ.. కళ్లు మూస్తే టై ట్రావెల్ చేసే హీరో.. ఎందులో చూడాలంటే!
ఒకప్పుడు ఫిల్మ్ మేకర్లు ప్రయోగాలు చేయాలంటే భయపడేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కొత్త కథనాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలా ఇప్పటికే అన్ని ఇండస్ట్రీల్లోనూ ఎన్నో రకాల ఎక్స్‌పిరమెంటల్ మూవీలు వచ్చాయి. వాటిలో చాలా వరకూ ఆడియెన్స్‌ను అలరించాయి. అలాంటి ఓ సినిమానే 'బ్లింక్' (Blink).
'దసరా' మూవీలో నానికి స్నేహితుడిగా నటించిన కన్నడ హీరో దీక్షిత్ శెట్టి నటించిన తాజా చిత్రమే 'బ్లింక్'. హీరో కళ్లు మూస్తే టైం ట్రావెల్ అయ్యే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మార్చి 8వ తేదీన ఈ సినిమా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

కన్నడ టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా శ్రీనిధి బెంగళూరు తెరకెక్కించిన 'బ్లింక్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే తక్కువ స్పందననే సొంతం చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంలో ఈ సినిమా సఫలం అయింది. తద్వారా దీక్షిత్ శెట్టి ఖాతాలో మరో విజయం వచ్చి చేరినట్లు అయింది.
దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'బ్లింక్' మూవీపై నెలకొన్న అంచనాల వల్ల.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు భారీ పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. వీటి కోసం ఫ్యాన్సీ రేటును కూడా ముట్టజెప్పింది. ఎన్నో అనుమానాలు, ఊహాగానాల నడుమ తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

'బ్లింక్' మూవీ కన్నడ వెర్షన్‌ను నేటి అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, తెలుగు, తమిళం డబ్బింగ్ మాత్రం ప్రస్తుతానికి రాలేదు. మరికొద్ది రోజుల్లోనే దీన్ని ఈ రెండు భాషల్లోకి తీసుకు రాబోతున్నారు. ఇప్పుడైతే ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో రన్ అవుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు మిస్ అవకుండా చూసేయండి మరి.
ఇదిలా ఉండగా.. దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన 'బ్లింక్' మూవీని జనని పిక్చర్స్ బ్యానర్‌పై రవిచంద్ర ఏజే నిర్మించారు. ఇందులో మందారా హీరోయిన్‌గా నటించగా.. చైత్ర జే ఆచార్, విశాల్ జైవిక్, గోపీకృష్ణ దేశ్‌పాండే, సురేష్ అనగల్లి, కిరణ్ నాయక్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ ఎస్‌ఎస్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











