కళ్లు మూస్తే టైం ట్రావెల్ చేసే హీరో.. ఆ ఓటీటీలో నాని ఫ్రెండ్ థ్రిల్లర్ మూవీ

ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత సీడీలు ఎక్సెట్రాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఓటీటీల రూపంలో ప్రేక్షకులకు మూవీలు మరింత చేరువ అవుతున్నాయి. దీంతో ఎన్నో కొత్త తరహా సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలా కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రమే 'బ్లింక్' (Blink).

'దసరా' మూవీలో నానికి ఫ్రెండ్‌గా మెప్పించిన కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన సినిమానే 'బ్లింక్'. హీరో కళ్లు మూస్తే టైం ట్రావెల్ చేసే డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది. ఫలితంగా దీనిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే మార్చి 8వ తేదీన ఈ సినిమాను కన్నడంలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Dheekshith Shetty Starrer Blink Movie Telugu Version Streaming Started on Amazon Prime

కన్నడ టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా శ్రీనిధి బెంగళూరు అదే దర్శకుడు తీసిన 'బ్లింక్' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే కాసింత ఎక్కువగానే స్పందనను సొంతం చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంలో ఈ సినిమా సఫలం అయింది. తద్వారా దీక్షిత్ శెట్టి ఖాతాలో మరో విజయం వచ్చింది.

గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చిన 'బ్లింక్' మూవీపై నెలకొన్న అంచనాల వల్ల.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు భారీ పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. వీటి కోసం ఫ్యాన్సీ రేటును కూడా ముట్టజెప్పింది. ఇక, ఈ సినిమా కన్నడ వెర్షన్ మే 15వ తేదీ నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కూడా అవుతోంది.

Dheekshith Shetty Starrer Blink Movie Telugu Version Streaming Started on Amazon Prime

'బ్లింక్' మూవీ కన్నడ వెర్షన్‌ వెర్షన్‌కు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అదిరిపోయే స్పందన లభించింది. దీంతో ఇప్పుడు సదరు సంస్థ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను కూడా రెడీ చేసింది. దీన్ని గత అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలిసింది. మంచి థ్రిల్లర్ మూవీ చూడాలంటే మీరు కూడా దీనిపై లుక్కేయండి మరి.

ఇదిలా ఉండగా.. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'బ్లింక్' మూవీని జనని పిక్చర్స్ బ్యానర్‌పై రవిచంద్ర ఏజే నిర్మించారు. ఇందులో మందారా హీరోయిన్‌గా చేసింది. అలాగే, చైత్ర జే ఆచార్, విశాల్ జైవిక్, గోపీకృష్ణ దేశ్‌పాండే, సురేష్ అనగల్లి, కిరణ్ నాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ ఎస్‌ఎస్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.

More from Filmibeat

Read more about: blink dheekshith shetty blink ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X