Dhurandhar 2 OTT Release: ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్‌పై ట్విస్ట్.. రణ్‌వీర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2). ఉగాది, రంజాన్‌ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ధురంధర్ సక్సెస్‌తో ధురంధర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోవడంతో పాటు సరికొత్త బెంచ్ మార్క్‌లు సృష్టించింది ధురంధర్ 2. వసూళ్లపరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ 2000 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 OTT Release Delayed Jio Hotstar Strategy Shift Amid IPL Buzz

ధురంధర్ ది రివెంజ్ కలెక్షన్స్
తొలివారం ఈ సినిమాకు 623.42 కోట్ల రూపాయలు, రెండో వారం 245.85 కోట్ల రూపాయలు, 15వ రోజున 17.80 కోట్ల రూపాయలు, 16వ రోజున 21.55 కోట్ల రూపాయలు, 17వ రోజున 25.65 కోట్ల రూపాయలు, 18వ రోజున 28.75 కోట్ల రూపాయలు, 19వ రోజున 7.29 కోట్ల రూపాయలు, 20వ రోజున 10.10 కోట్ల రూపాయలు, 21వ రోజున 7.90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 21 రోజుల వరకు ఇండియాలో ధురంధర్ 2 మూవీ 1045.85 కోట్ల రూపాయల నెట్... 1252 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు హిందీలో 1003.75 కోట్ల రూపాయలు, తెలుగులో 41.02 కోట్ల రూపాయలు, తమిళంలో 18.37 కోట్ల రూపాయలు, కన్నడంలో 3.11 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.73 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

ధురంధర్ 2 ఓవర్సీస్ కలెక్షన్స్
రణ్‌వీర్ సింగ్ మూవీ భారత్‌తో సమానంగా విదేశాల్లోనూ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 407 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. అత్యధికంగా నార్త్ అమెరికాలో 223 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఆస్ట్రేలియాలో 35 కోట్ల రూపాయలు, యూకేలో 36 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 5 కోట్ల రూపాయలు, యూరప్ సహా ఇతర దేశాలలో 45 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు ధురంధర్ 2 చిత్రానికి 1653.67 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్‌పై ట్విస్ట్
ధురంధర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా డీల్ కుదిరింది. దీని ప్రకారం మే మూడో వారంలో ధురంధర్ 2 స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ధురంధర్ 2 అంచనాలను మించి థియేటర్‌లో దుమ్మురేపుతుండటం, 1700 కోట్ల మార్క్‌కు చేరువగా వస్తుండటంతో జియో హాట్‌స్టార్ తన స్ట్రాటజీ మార్చుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

స్ట్రీమింగ్‌కు అదే అడ్డంకి?
మరో వెర్షన్ ప్రకారం... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్‌కు అడ్డుపడుతోందని వార్తలు వస్తున్నాయి. మే నెలలో ఐపీఎల్‌కు సంబంధించి అత్యంత కీలకం.. ప్లే ఆఫ్స్ ముగిసి క్వాలీఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ సమయంలో ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయిలో ఉంటుంది. ఈ టైంలో ధురంధర్ 2ను ఓటీటీలోకి తీసుకొస్తే వ్యూస్‌పై ప్రభావం పడుతుందని నిర్మాతలు, జియో హాట్ స్టార్ భావిస్తున్నాయి. దాంతో ఐపీఎల్ 2026 ముగిశాక.. ఓటీటీలో ధురంధర్ 2ను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X