Dhurandhar 2 OTT: ధురంధర్ 2 డిజిటల్ రైట్స్‌కి రికార్డ్ ధర.. రణ్‌వీర్ మూవీ ఏ ఓటీటీ చేతికి? డీల్ ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ మూవీ ధురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2). రంజాన్, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న ధురంధర్ 2ను వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అంచనాలకు తగినట్లుగానే ధురంధర్ 2కు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. తాజాగా రణ్‌వీర్ సింగ్ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌పై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి ధురంధర్ 2 ఓటీటీ డీల్ ఎంత? ఏ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది? అనేది పరిశీలిస్తే..
ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధర్, లోకేష్ ధర్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని దాదాపు 475 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. తొలి భాగం కేవలం ఒక్క హిందీలో మాత్రమే విడుదల కాగా.. సెకండ్ పార్ట్ విషయంలో అలాంటి తప్పు చేయకుండా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ధురంధర్ 2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.

ధురంధర్ 2 డిస్ట్రిబ్యూషన్ ఇలా
ధురంధర్ 2 చిత్రానికి దేశంలో ప్రముఖ మల్టీప్లెక్స్ ఛైన్‌గా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. సెంట్రల్ ఇండియా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ధురంధర్ 2 మూవీని ఈ సంస్థ పంపిణీ చేయనుంది. హిందీ తర్వాత దేశంలో పెద్ద మార్కెట్‌గా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎవరు రిలీజ్ చేయనున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది. ధురంధర్ 2 థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాతలు బేరసారాలు సాగిస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి.
ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్
మరోవైపు.. మార్చి 18వ తేదీన ధురంధర్ 2 మూవీని ఇండియాలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. దీనికి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ధురంధర్ 2 హిందీ వెర్షన్‌కు గాను 1,94,263 టికెట్లు అమ్ముడై 12.07 కోట్ల రూపాయల కలెక్ట్ చేసింది. తెలుగులో 9.47 లక్షల రూపాయాలు, తమిళంలో 9.91 లక్షల రూపాయలు, మలయాళం+ కన్నడలో కలిపి 1.63 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్‌లో ఒక్క ఇండియాలోనే 12.29 కోట్ల రూపాయలు రాబట్టింది. అటు ఓవర్సీస్‌లో ధురంధర్ తిరుగులేని జైత్రయాత్ర సాగిస్తోంది. అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్‌కు సంబంధించి 557 సెంటర్స్‌లో 38500 టికెట్లు అమ్ముడై... 6,18,911 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 5.15 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. తద్వారా అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా ధురంధర్ 2 మూవీ 18 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ధురంధర్ 2 ఏ ఓటీటీ చేతికి?
ధురంధర్: ది రివెంజ్‌పై అంచనాల నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ మూవీ డిజిటల్ రైట్స్ టాప్ కంపెనీల మధ్య పోటీ నెలకొంది. తొలుత ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషలో అనూహ్యంగా జియో హాట్‌స్టార్ ఈ డీల్ దక్కించుకుంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ధురంధర్ 2 మూవీ ఓటీటీ డీల్ వాల్యూ 150 కోట్ల రూపాయలట. దీనిని బట్టి రణ్‌వీర్ సింగ్ మూవీ క్రేజ్‌ను అర్ధం చేసుకోవచ్చు. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ధురంధర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు ఒప్పందం జరిగింది. దీనిని బట్టి ధురంధర్ 2 చిత్రం మే మొదటి వారంలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications

















