Dhurandhar 2 on OTT: ఓటీటీలో ధురంధర్ 2 సంచలనం... రణ్‌వీర్ సింగ్ మూవీ ఆల్‌టైం రికార్డ్

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2). భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 19న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ధురంధర్ తొలి భాగం సక్సెస్‌తో ధురంధర్ ది రివెంజ్‌పై పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోవడంతో పాటు సరికొత్త బెంచ్ మార్క్‌లు సృష్టించింది ధురంధర్ 2. వసూళ్లపరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలలో రెండో స్థానంలో నిలిచింది ధురంధర్ 2. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇక్కడా సంచలనం సృష్టించింది. ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు.

Dhurandhar 2 OTT Report Ranveer Singh Movie crosses 50 million views on JioHotstar

ధురంధర్ 2 కలెక్షన్స్
ధురంధర్ 2 వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 1149 కోట్ల రూపాయల నెట్.. 1375 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ధురంధర్ విధ్వంసం మామూలుగా సాగలేదు. నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా అన్ని చోట్లా కలిపి ఏకంగా 438 కోట్ల రూపాయలు రాబట్టి చరిత్ర సృష్టించింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ధురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1813 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా బాహుబలి 2, పుష్ప 2 వంటి సినిమాల రికార్డులను బద్ధలు కొట్టి దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ సినిమాగా నిలిచింది.

ధురంధర్ 2 ఓటీటీ
ధురంధర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా డీల్ కుదిరింది. దీని ప్రకారం మే మూడో వారంలో ధురంధర్ 2 స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ధురంధర్ 2 అంచనాలను మించి థియేటర్‌లో దుమ్మురేపుతుండటంతో పాటు ఆ సమయంలో ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌లో ఉండటంతో ఆలస్యంగా ఓటీటీలోకి వదిలింది హాట్ స్టార్. జూన్ 4 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ధురంధర్ 2 స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది జియో హాట్‌స్టార్.

ఓటీటీలో ధురంధర్ 2 సంచలనం
ఓటీటీలో అడుగుపెట్టిందో లేదో రణ్‌వీర్ సింగ్ మూవీ అప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ మార్చేసింది. ఓటీటీలోకి విడుదలైన తొలివారంలోనే ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ (5 కోట్ల వ్యూస్)ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ వ్యూస్‌లో అత్యధికంగా కనెక్టెడ్ టీవీ వెర్షన్‌ నుంచి దాదాపు 60 శాతం మేర రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లార్జ్ స్క్రీన్‌పై చూడాలనుకునే వారి సంఖ్యకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. అలాగే జియో హాట్ స్టార్‌కు లాంగ్వేజ్ ఓటీటీ మార్కెట్‌లో ఉన్న బలం తెలియజేస్తోంది.

మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ధురంధర్ ది రివెంజ్‌పై చర్చల కారణంగా థియేట్రికల్ రన్ ముగిసినప్పటికీ ఈ సినిమా తన ప్రభావాన్ని చూపుతోంది. ఓటీటీలోకి విడుదలైన మొదటి వారంలోనే 5 కోట్ల వ్యూస్ చేరుకోవడం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. గతంలో ధురంధర్ మొదటి భాగం ఓటీటీలో విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే 32 మిలియన్ల వీక్షణలను సాధించగా.. ఈ రికార్డ్‌ను ధురంధర్ 2 అధిగమించింది. మరి రానున్న రోజుల్లో ధురంధర్ 2 ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more about: dhurandhar 2 ranveer singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X