RRR రికార్డును తిరగరాసిన ధురంధర్.. 10 వారాలుగా రణ్‌వీర్ సింగ్ మూవీ ప్రభంజనం!

ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ ది రివెంజ్ చిత్రం థియేట్రికల్‌గా సంచలనాలు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంటే.. ధురంధర్ చిత్రం ఓటీటీలో ధమాకా క్రియేట్ చేస్తున్నది. 10 వారాల క్రితం ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలో కూడా ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ చిత్రం RRR సాధించిన రికార్డును అధిగమించింది. ఈ చిత్రం గత 10 వారాల్లో ఓటీటీలో ఏ మేరకు వ్యూస్ సాధించింది? RRR మూవీ రికార్డును ఎలా అధిగమించిందనే వివరాల్లోకి వెళితే..

రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన ధురంధర్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 1300 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఓటీటీతో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. థియేట్రికల్‌గా ఎంత హల్‌చల్ సృష్టించిందో.. ఓటీటీలో కూడా అదే రేంజ్‌లో రెస్పాన్స్ కూడగటట్టుకొన్నది.

Dhurandhar Beats RRR

ఓటీటీలో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ సాధించి 10 వారాల్లో 30 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రంగా RRR రికార్డు క్రియేట్ చేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ నటించగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఓటీటీలో కూడా ప్రేక్షకులు బ్రహ్మండంగా ఆదరించారు. ఇప్పటి వరకు ఆ సినిమాపైనే అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు ఉంది.

అయితే తాజాగా ధురంధర్ ప్రభంజనం ఓటీటీలో కూడా కొనసాగింది. గత 10 వారాల డేటా పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 31.1 మిలియన్ వ్యూస్ సాధించినట్టు వెల్లడైంది. దాంతో RRR రికార్డును అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్‌గానే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్సాన్స్‌ను కూడగట్టుకొంటున్నది అని ఓటీటీ ఎక్స్‌పర్ట్స్ వెల్లడించారు.

ధురంధర్ చిత్రం 10వ వారాల తర్వాత కూడా ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతున్నది. ఇటీవల వచ్చిన సినిమాలకు ధీటుగా వ్యూస్ సాధిస్తున్నది. ఇంకా కొద్ది వారాలపాటు ఈ ట్రెండ్ కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

బాలీవుడ్ నటులు ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ చిత్రం సుమారుగా 250 కోట్ల రూపాయలతో రూపొందింది. సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే.

Read more about: Dhurandhar rrr netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X