Dhurandhar OTT: ‘పుష్ప 2' రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్'.. ఓటీటీ డీల్ ఎన్ని కోట్లంటే?
Dhurandhar OTT: భారతీయ సినిమా మరోసారి గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, 'ఉరి'ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ (Dhurandhar) ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
ఇలా భారీ బ్లాక్‌బస్టర్ విజయం నేపథ్యంలో 'ధురంధర్' ఓటీటీ డీల్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది. మొదట్లో ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix) రెండు భాగాలకు కలిపి రూ.130 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. అంటే ఒక్కో పార్ట్‌కు రూ.65 కోట్ల చొప్పున ఒప్పందం కుదిరినట్టు టాక్ వినిపించింది. అయితే థియేటర్లలో సినిమా ఊహించని స్థాయిలో హిట్ కావడంతో, ఈ డీల్ విలువ మరింత పెరిగినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

రూ. 285 కోట్ల ఓటీటీ డీల్ నిజమేనా?
బాలీవుడ్ మూవీ క్రిటిక్ రవి చౌదరి చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 'ధురంధర్' ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లకు సొంతం చేసుకుందట. ఇదే నిజమైతే, ఇది హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓటీటీ డీల్‌గా రికార్డు అవుతుంది. ఇప్పటివరకు ఈ రికార్డు పుష్ప 2 (Pushpa 2: The Rule)పేరిట ఉంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ రికార్డును ధురంధర్ పది కోట్ల తేడాతో అధిగమించినట్టు తెలుస్తోంది.
అయితే మరోవైపు సినీ వర్గాల్లో మరో వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి రెండు భాగాలకు కలిపి రూ.130 కోట్ల డీల్ ముందే ఫిక్స్ అయిందని, ఇప్పుడు బాక్సాఫీస్ సక్సెస్‌తో అదనపు బోనస్ లేదా రీ-నెగోషియేషన్ జరిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. రూ. 285 కోట్ల ప్రచారం పూర్తిగా హైప్ కోసమేనన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో, నిజం ఏమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఓటీటీలో ఎప్పుడు వస్తుంది?
హిందీ సినిమాల ట్రెండ్ ప్రకారం.. థియేటర్లలో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. ఆ లెక్కన చూస్తే, డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' 2026 జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. జనవరి 16 నుంచి 30 మధ్యలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ బ్లాక్ బాస్టర్ మూవీలో హీరో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్.మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. 'ధురంధర్: రివెంజ్' పేరుతో పార్ట్ 2 మార్చి 19న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











